రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య ఇచ్చిన ఫిర్యాదు కారణంగా గుంటూరు కు చెందిన మస్తాన్ సాయిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మస్తాన్ సాయి తో కలిసి పార్టీల్లో పాల్గొన్నప్పుడు మత్తుమందు కలిపి పలువురు మహిళలపై అత్యాచారం చేశాడని, ఆ వీడియోలను చూపించి బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసి వాటిని కూడా సీక్రెట్ గారికార్డు చేసాడని అందుకు సంబందించిన హార్డ్ డిస్క్ ను పోలీసులకు అందజేసింది లావణ్య. ఈ కేసులో మరిన్ని వాస్తవాలను రాబట్టేందుకు మస్తాన్ సాయిని తమ కస్టడీకి తీసుకున్నారు పోలీసులు.
Also Read : Sree Leela: శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. సాంగ్ రిలీజ్
కాగా మస్తాన్ సాయి కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. మస్తాన్ సాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలు గా తొలగించాలని, ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కి అడ్వకేట్ నాగూర్ బాబు లేఖ రాసారు. మస్తాన్ దర్గా ధర్మకర్త కొడుకు అయిన మస్తాన్ సాయి నేరాల కారణంగా దర్గా పవిత్రకు , భద్రతకు, భంగం వాటిల్లుతుందని లేఖ లో పేర్కొన్నారు నాగుర్ బాబు. మస్తాన్ సాయి పై ఇప్పటికే మహిళల నగ్న చిత్రాలు, డ్రగ్స్ కేసులు, అత్యాచారం వంటి ఐదు క్రిమినల్ కేసులు ఉన్నందున, భక్తుల భద్రతకు, దర్గా ప్రతిష్ట కి భంగం వాటిల్లుతుంది అని లేఖలో వివరించారు. మస్తాన్ దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు కుటుంబ ఆధిపత్యాన్ని తొలగించి, ప్రభుత్వం లేదా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో దర్గా ని నడపాలని కోరారు నాగూర్ బాబు.