గురుగ్రామ్ భూమి కేసుకు సంబంధించి వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా బుధవారం వరుసగా రెండో రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలోనికి వెళ్లారు. 2008 హర్యానా భూ ఒప్పందం, మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాను ఈడీ విచారిస్తోంది. మంగళవారం దాదాపు ఐదు గంటల పాటు విచారించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PLMA) కింద ఆయన వాంగ్మూలాలను నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. బుధవారం కూడా వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా రాబర్ట్ వాద్రా మీడియాతో మాట్లాడారు. తాను బీజేపీ లో ఉండి ఉంటే.. పరిస్థితి వేరేలా ఉండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
READ MORE: AP Crime: అమ్మాయిలను ట్రాప్ చేస్తారు.. న్యూడ్ వీడియోలు తీసి పోర్న్ సైట్లకు అమ్మేస్తారు..!
నిత్యం ప్రజల కోసం పోరాడే గాంధీ కుటుంబంలో తాను భాగమని రాబర్ట్ వాద్రా తెలిపారు. దాంతో సహజంగానే తనను, తన కుటుంబాన్ని బీజేపీ లక్ష్యంగా చేసుకుంటుందని ఆరోపించారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై కూడా ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని.. అధికార పార్టీ ఎంతగా ఇబ్బంది పెడితే.. తాము అంతగా బలపడతాన్నారు. తమకు ఎదురయ్యే ప్రతిసవాలును దాటుకొని ముందుకు వెళతామని స్పష్టం చేశారు. కానీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం దురదృష్టకరమని విమర్శించారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపే వారిపై ఒత్తిడి తెచ్చేందుకు వాటిని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సంస్థలపై ప్రజలు నమ్మకం కోల్పోయారన్నారు. నేను
బీజేపీ పార్టీలో ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. ప్రజలు తనతో ఉన్నారని.. రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారన్నారు.
READ MORE: KGF Star Yash: కేజీఎఫ్ రాకీ భాయ్ వాడే లగ్జరీ కారు ఎన్ని కోట్లో తెలుసా?