Pawan Kalyan : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది, అంటే 2026 జనవరి 3వ తేదీ శనివారం నాడు ఆయన కొండగట్టు క్షేత్రానికి విచ్చేయనున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు కావడంతో అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు భక్తుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఈ పర్యటనలో భాగంగా ఆలయ అభివృద్ధికి సంబంధించి పలు కీలక కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.…
స్టీలు ప్లాంటు మీద ప్రధాని మోడీ కన్ను పడిందని మాజీ ఎమ్మె్ల్యే జగ్గారెడ్డి తెలిపారు. స్టీలు ప్లాంటును ఎవరికో కట్టబెట్టాలనే దురుద్దేశంతో ప్రయత్నాలు మొదలయ్యాయి.. ఏపీ కాంగ్రెస్ లో రాజకీయంగా ప్రతినిధులు లేకుండా పోయారు.
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి, ఉపాధి కల్పన, భద్రత, మౌలిక సదుపాయాలపై పవన్ కల్యాణ్ కీలక దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల్లో…
Pawan Kalyan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. జనసేన పదవి – బాధ్యత పేరుతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కులాల గురించి మాట్లాడటానికి నాకు ఇబ్బంది ఉండదు.. అన్ని కులాలను పూర్తిగా అధ్యయనం చేసాను అన్నారు.. అయితే, వైసీపీని పొలిటికల్ పార్టీగా గుర్తించడం లేదు.. ఆకు రౌడీల పార్టీగా గుర్తిస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. బలమైన ఐడియాలజీ ఉంది కనుకే ధైర్యంగా…
Pawan Kalyan: 21 ఎమ్మెల్యే, 2 ఎంపీలు ఉన్న పార్టీకి ప్రధాని నరేంద్ర మోడీతో సహా జాతీయ స్థాయిలో మనకి గౌరవం ఇస్తున్నారంటే.. జనసేన అంత బలమైనది అని అర్థం అన్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. జనసేన పదవి – బాధ్యత పేరుతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రాంతీయ దృక్పథంతో నేను పార్టీ పెట్టలేదు.. జాతీయ దృక్పథంతో ప్రాంతీయ పార్టీ పెట్టాలి అనుకుని పెట్టాను అన్నారు.. జనసేన ఐడియాలజీ గడిచే…
Pawan Kalyan: అమరావతిలో జరిగిన జనసేన పార్టీ పదవి–బాధ్యత కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నామినేటెడ్, వివిధ పార్టీ పదవుల్లో ఉన్న నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ఆలోచనాధారిత రాజకీయాలు, సామాజిక సమానత్వం, బాధ్యతాయుతమైన నాయకత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సామాజికవర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్టు పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ‘రెల్లి’ సామాజికవర్గానికి…
రాయ్‌గఢ్‌లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..! ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో విషాదం చోటుచేసుకుంది. బీటెక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు ముందు నోట్లో అన్ని విషయాలు రాసి ప్రాణాలు తీసుకుంది. కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రిన్సీ కుమారి(20) .. జార్ఖండ్‌లోని జంషెడ్పూర్ నివాసి. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలోని ఒక విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్‌లో బిటెక్ రెండవ సంవత్సరం చదువుతోంది. పుంజిపాత్ర సమీపంలోని విశ్వవిద్యాలయ హాస్టల్లో నివసిస్తోంది. శనివారం రాత్రి హాస్టల్…
టాలీవుడ్ స్టార్ హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తమ అనుమతి లేకుండా పేర్లు, ఫోటోలు వాడటాన్ని నిలువరించాలని కోరుతూ ఈ ఇద్దరు హీరోలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమ పేరు, ప్రతిష్ఠను వాణిజ్య ప్రయోజనాల కోసం అనధికారికంగా ఉపయోగించడం చట్టవిరుద్ధమని పిటిషన్లలో పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రకటనలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, ఇతర ప్రచార కార్యక్రమాల్లో అనుమతి లేకుండా ఫోటోలు, పేర్లు వాడటాన్ని తక్షణమే ఆపాలని వారు కోర్టును కోరారు. Also Read : BMW…
టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతున్న నేపథ్యంలో మరోసారి స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. అయితే ఈ క్రమంలో ఫ్యాన్స్ మధ్య అనవసరమైన వార్ మొదలవడం చర్చనీయాంశంగా మారింది. అసలు విషయం ఏంటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మురారి సినిమా నూతన సంవత్సర కానుకగా ఈ నెల 31న మరోసారి థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి…
Deputy CM Pawan Kalyan: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించే దిశగా రూ.3,050 కోట్లతో అమరజీవి జలధార ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని వారు ఇప్పుడు ఏం చేస్తారని ప్రశ్నించారు. విదేశాల్లో కూర్చుని…