Viral Video: ప్రతి నిత్యం సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు ప్రత్యక్షమవుతానే ఉంటాయి. ఇందులో కొన్ని ఆనందాన్ని పంచుతే, మరికొన్ని భయబ్రాంతులకు గురిచేస్తాయి. అప్పుడప్పుడు అడవి జంతువుల సంబంధించి అనేక వీడియోలు ప్రత్యక్షమవుతానే ఉంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సింహం సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అర్థరాత్రి ఇంట్లో ఏదో కదిలిన శబ్దం విని మీరు మేల్కొని బయటికి వచ్చేసరికి ఓ సింహం ముందే నిలబడి ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఊహకే చాలా భయం వేస్తుంది కదా.. ఇలాంటి భయానక అనుభవమే గుజరాత్‌లోని అమరేలి జిల్లాలో ఒక కుటుంబానికి ఎదురైంది. రాత్రి సమయంలో వారి ఇంటి వంటగది గోడపై ఓ సింహం కూర్చొని ఉండటం చూసి షాక్ గురయ్యారు.
Read Also: Hyderabad: హైదరాబాద్‌లో కమ్ముకున్న మేఘాలు.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం
ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని అమరేలి జిల్లాలోని కోవాయా గ్రామంలో మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. అడవిలో నుండి ఓ సింహం దారి తప్పి గ్రామంలోకి వచ్చేసింది. ఆలా వచ్చిన సింహం ఓ ఇంటి వంటగది గోడపై కూర్చుని ఉండిపోయింది. ఈ సమయంలో ప్రమాదకర జంతువు ఉందని తెలియక ఆ ఇంట్లోని వారు వినిపించిన గర్జనను మాత్రం మామూలు పిల్లి శబ్దంగా భావించారు. కానీ, టార్చ్ వెలుతురులో చూసేసరికి వారి గుండె ఆగినంత పని అయింది. సింహం కనిపించగానే ఆ కుటుంబ సభ్యులందరూ భయంతో వణికిపోయారు.
వీడియోలో గమనించినట్లయితే, ఒక వ్యక్తి టార్చ్ వెలుతురును వంటగది గోడపై వేసినప్పుడు తొలుత సింహం తోక మాత్రమే కనిపిస్తుంది. కొద్ది క్షణాల్లో సింహం తన మెడ తిప్పి ఇంట్లోకి తలచూపినప్పుడు భయంతో కుటుంబ సభ్యులందరూ బయటకు పరుగెత్తారు. చీకటిలో సింహంపై టార్చ్ వేయడంతో దాని కళ్లు వెలగడం మనం గమినించవచ్చు. అయితే ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. సింహం ఎవరినీ గాయపరచకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. మరో వీడియోలో అదే సింహం గ్రామంలోని ఓ ఆలయం దగ్గర తిరుగుతూ కనిపించింది. గ్రామస్థులు ఈ సంఘటనతో భయాందోళనకు గురవుతుండగా అటవీ శాఖ అధికారులను సంప్రదించారు.