THE Paradise: నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న ది ప్యారడైజ్ మూవీపై భారీ హైప్ ఉంది. ఈ మూవీ టీజర్ తోనే ఇండస్ట్రీ షేక్ అయ్యేలా చేసింది. లం.. కొడుకు అనే పేరును హీరో చేతిపై టాటూగా చూపించడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అసలు ఈ మూవీ కథ, విజువల్స్ అన్నింటిపై భారీగా హైప్ ఉంది. హైదరాబాద్ చారిత్రక నేపథ్యంలో ఈ మూవీని తీసుకొస్తున్నారు. ఇందులో ఓ వర్గానికి నాయకుడిగా నాని కనిపించబోతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు అయితే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. మూవీ అసలు కథ ఏంటి అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అయితే ఈ మూవీ గురించి తాజాగా మరో అప్డేట్ వచ్చింది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మే2 నుంచి స్టార్ట్ కాబోతోంది. మే 15 నుంచి నాని షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.
Read Also : Disha Patani : దిశా పటానీ కత్తిలాంటి ఫోజులు..
మూవీ టీమ్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. నాని ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాల కంటే ఈ మూవీకే భారీ క్రేజ్ వస్తోంది. ఇప్పటికే శ్రీకాంత్, నాని కాంబోలో వచ్చిన దసరా సినిమా భారీ హిట్ అయింది. అందుకే వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు పెరుగుతున్నాయి. హిట్-3 మూవీని నాని కంప్లీట్ చేసేశాడు. ఆ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. కాబట్టి ప్యారడైజ్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాడు నాని. ఆ మూవీని 2026 మార్చి 26న రిలీజ్ చేస్తున్నట్టు మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇంగ్లిష్, స్పానిష్ తో పాటు మొత్తం 8 భాషల్లో మూవీని రిలీజ్ చేస్తున్నారు.