స్మార్ట్ ఫోన్ ప్రియులకు మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. షియోమి భారత్ లో చౌకైన రెడ్‌మీ A5 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ 4G కనెక్టివిటీతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.88-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ బడ్జెట్ ఫోన్‌లో ఆక్టా-కోర్ Unisoc T7250 ప్రాసెసర్ ఉంది. ఇది 4GB వరకు RAM, 4GB వర్చువల్ RAMకి సపోర్ట్ చేస్తుంది.
Also Read:Sunil Balusu: టాలీవుడ్ నిర్మాతలపై ఓటీటీ పెత్తనం.. యంగ్ నిర్మాత సంచలన వ్యాఖ్యలు
రెడ్‌మీ A5 4G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ చేయబడింది. దీని మొదటి వేరియంట్ 3GB RAM + 64GB స్టోరేజ్ తో రూ. 8999 ధరకు తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ను మొదటి సేల్‌లో రూ. 6499 కు కొనుగోలు చేయవచ్చు. రెండవ వేరియంట్ 4GB RAM + 128GB స్టోరేజ్‌తో రూ. 9999 కు వస్తుంది. దీనిని మొదటి సేల్‌లో రూ. 7499 కు కొనుగోలు చేయవచ్చు.
ఈ ఫోన్ బ్లూ, బ్లాక్, గోల్డ్ అనే మూడు కలర్స్ లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ఏప్రిల్ 16న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమవుతుంది.
Also Read:Nitin Gadkari: ఢిల్లీలో మూడ్రోజులు ఉంటే మీ ఆరోగ్యం పాడైపోతుంది..
Redmi A5 స్పెసిఫికేషన్లు
డిస్ప్లే – 6.88-అంగుళాల (1640 x 720 పిక్సెల్స్) HD+ IPS LCD స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్. ఇది TÜV రీన్‌ల్యాండ్-సర్టిఫైడ్. ఈ ఫోన్‌లో 1.8 GHz ఆక్టా-కోర్ UNISOC T7250 12nm ప్రాసెసర్ ఉంది, దీనిలో గ్రాఫిక్స్ సపోర్ట్ కోసం Mali-G57 MP1 GPU ఉంది. ఈ ఫోన్ 3GB, 4GB RAM తో 64GB, 128GB స్టోరేజ్ తో లాంచ్ చేయబడింది. ఈ ఫోన్‌లో 32MP వెనుక కెమెరా ఉంది. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించబడింది. ఈ రెడ్‌మి ఫోన్‌లో 5200mAh బ్యాటరీ ఉంది. ఇది 15W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం ఈ Redmi ఫోన్‌లో డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac 2.4GHz/5GHz, బ్లూటూత్ 5.2, GPS, GLONASS తో గెలీలియో, BDS ఉన్నాయి.