Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి మద్యం కేసులో విచారణకు హాజరు కావాలంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది.. విజయవాడలో ఉన్న సిట్ కార్యాలయానికి ఈనెల 18వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది సిట్.. ఇప్పటికే ఈ కేసులో విచారణకు రావాలని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసినా.. ఆయన విచారణకు హాజరు కాలేదు.. తాజాగా విజయసాయి రెడ్డికి సిట్ నోటీసులు జారీ అయ్యాయి.. అయితే, మద్యం కుంభకోణంలో రేపు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుఅవుతున్నారు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి.. అంటే నోటీసుల్లో పేర్కొన్న దానికంటే ఒకరోజు ముందుగానే విచారణకు వెళ్లబోతున్నారు.. ఈ మేరకు సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు సాయిరెడ్డి.. తొలుత ఈ నెల 18న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు.. అయితే తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ఉండటంతో 17వ తేదీన విచారణకు వస్తున్నానని సమాచారం పంపించారు విజయ సాయిరెడ్డి.. ఇక, 17వ తేదీన విచారణకు రావాలని, తాము రెడీ అని విజయసాయికి సిట్ సమాచారం పంపిందట..
Read Also: CM Chandrababu: ఏపీ పరిస్థితి, అప్పులపై ఆర్థిక సంఘానికి సీఎం వివరణ.. ప్రత్యేక సాయం వచ్చేలా చూడండి..!