ఓ ప్రయాణికుడు.. డాగ్‌తో కలిసి రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుండగా ఊహించని పరిణామం ఎదురైంది. పెంపుడు కుక్క రన్నింగ్ ట్రైన్ ఎక్కలేక ఫుట్‌పాత్-రైలు మధ్యలో పడిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: RK Roja: అరెస్టులు చేస్తే చేసుకోండి..! చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై రోజా హాట్ కామెంట్స్..
రైల్వేస్టేషన్‌లో పెంపుడు కుక్కతో కలిసి ప్రయాణికుడు రైలు ఎక్కుతున్నారు. అయితే డాగ్ లోపలికి ఎక్కలేకపోయింది. ప్రయాణికుడు శతవిధాలా ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. భయాందోళనకు గురైన డాగ్.. పుట్‌పాత్-ట్రైన్ మధ్య ఉన్న గ్యాప్‌లో పడిపోయింది. ఒక్కసారిగా ప్రయాణికుడు షాక్‌కు గురయ్యాడు. ఇక ఈ ఘటనలో ప్రయాణికుడికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే కుక్క పరిస్థితి ఏంటి? అనేది వీడియోలో కనిపించలేదు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో కూడా వివరాలు లేవు. కుక్క చిన్న గాయంతో బాగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: బీసీల లెక్క తేలకుండా రిజర్వేషన్లు ఇవ్వలేమని కోర్టులు చెప్పాయి..
డాగ్ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందించారు. డాగ్ పట్ల యజమాని నిర్లక్ష్యం వహించాడని జంతు ప్రేమికులు ధ్వజమెత్తారు. ఇంకొందరైతే కుక్క మీద కాకుండా మనుషులపై ప్రేమ చూపించండని నెటిజన్లు పేర్కొన్నారు. మరికొందరైతే అలాంటి వ్యక్తులను పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలని డిమాండ్ చేశారు. పలువురు అతడు కావాలని తప్పు చేయలేదని సమర్థించారు. ఇలా రకరకాలుగా నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇంతకీ ఆ వీడియోను మీరు కూడా చూసేయండి.
When money can't buy wisdom! pic.twitter.com/suADun73fu
— Trains of India (@trainwalebhaiya) April 1, 2025