Chia Seeds: చియా విత్తనాలు చిన్నవైనా ఆరోగ్య పరంగా చాలా గొప్ప ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఇవి పోషక విలువలతో నిండిన సూపర్ ఫుడ్‌గా బాగా పని చేస్తాయి. ముఖ్యంగా ఫైబర్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక కీలకమైన పోషకాలు చియా విత్తనాల్లో అధికంగా ఉంటాయి. మరి ఇన్ని పోషకాల వల్ల మన శరీరం ఎలాంటి ప్రయోజనాలను పొందుతుందమో ఒకసారి చూద్దామా..
Read Also: Sambhal: సంభాల్ మసీదు వద్ద పోలీస్ అవుట్‌పోస్ట్.. ప్రారంభించిన 8 ఏళ్ల బాలిక..
చియా విత్తనాల్లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇది మలబద్ధక సమస్యను నివారించడంలో బాగా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో కొంతవరకు సహాయపడుతుంది. చియా విత్తనాలు నీటిని శోషించుకుని జెల్ రూపంలో మారతాయి. దీని వల్ల పొట్ట నిండిన అనుభూతిని కలిగించి అధికాహారం తినకుండా అడ్డుకుంటుంది. ఇందులోని కాల్షియం, ఫాస్ఫరస్, మగ్నీషియం లాంటి ఖనిజాలు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చియా విత్తనాలు రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా డయాబెటిక్ రోగులకు ఇది ఉపయోగకరం.
మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న చియా విత్తనాలను రోజువారీ ఆహారంలో ఎలా ఉపయోగించాలన్న విషయైకి వస్తే.. ముందుగా 1 టేబుల్ స్పూన్ చియా విత్తనాలను 1 గ్లాస్ నీటిలో 30 నిమిషాల పాటు నానబెట్టి తాగితే, శరీరానికి హైడ్రేషన్, ఎనర్జీ అందుతుంది. ఈ చియా విత్తనాలను ఫ్రూట్ జ్యూస్ లలో కలిపి త్రాగవచ్చు. చియా విత్తనాలను ఓట్స్, యోగర్ట్ లేదా ఫ్రూట్ సలాడ్‌లలో చల్లుకుని కూడా తీసుకోవచ్చు. ఈ విత్తనాలను రాత్రి సమయంలో నానబెట్టి ఉదయం పండ్లు, తేనెతో కలిపి పూడింగ్‌లా తీసుకోవచ్చు. మీకు ఇష్టమైతే చపాతి లేదా రోటీల పిండి కలిపేటప్పుడు చియా విత్తన పొడి వేసి కలిపితే మరింత ఆరోగ్యకరమైన రొటీలను తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రతిరోజు కాకపోయినా తరుచుగా వీటిని తినడాన్ని అలవాటుగా చేసుకోండి.