Viral video: భారతీయులు చేసే జుగాడ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదైనా పనిని కొత్తగా చేయడం మనకే సాధ్యం. చిన్నచిన్న సాదారణ వస్తువులను సృజనాత్మకంగా ఉపయోగించి వినూత్న ఐడియాలను అమలు చేస్తారు. అలాంటి ఓ క్రియేటివ్ జుగాడ్ ఇప్పుడు నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. క్రికెట్ ఆడే వారు తమ బ్యాట్ ను సురక్షితంగా ఉంచేందుకు మంచి కవర్లు, బ్యాగులు వాడతారు. అయితే, అందరికీ అటువంటి ఖరీదైన కవర్లు కొనుగోలు చేసే అవకాశం ఉండదు. కానీ, మన ఇండియన్స్ సమస్యలను స్మార్ట్‌గా సాల్వ్ చేయడం బాగా తెలుసు. ఈ క్రమంలో ఓ యువకుడు తన క్రికెట్ బ్యాట్‌కు ఒక వినూత్నమైన కవర్ తయారు చేసుకున్నాడు. అది కూడా తన పాత జీన్స్ ను ఉపయోగించి. అవును.. ఇందుకు సంబంధించి ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.
Read Also: SRH vs LSG: అనుకున్నంత కాకపోయినా పర్వలేదు.. లక్నో టార్గెట్ ఎంతంటే..?
ఈ వీడియోలో ఓ వ్యక్తి గ్రౌండ్‌కి వస్తూ కనిపిస్తాడు. అతని భుజాన ఒక జీన్స్ ప్యాంట్ లెగ్ భాగం కనిపిస్తుంది. మొదట అది సాధారణంగా అనిపించినా, ఆ వ్యక్తి దాన్ని ఓ బ్యాట్ కవర్‌గా మార్చుకున్నాడని తర్వాత అర్థమవుతుంది. ముందుగా అతడు జీన్స్ ప్యాంట్ కాళ్ల భాగాన్ని కింద, పక్కల నుండి కుట్టేశాడు. ఆపై బ్యాట్‌ను సులభంగా పెట్టుకోవడానికి పై భాగాన్ని ఓపెన్‌గా ఉంచాడు. ఆ తర్వాత జీన్స్ జేబును ఉపయోగించి బాల్ పెట్టుకునేలా డిజైన్ చేసుకున్నాడు. అంతేకాదు భుజంపై వేసుకునేలా బ్యాగ్‌లా స్ట్రాప్ కూడా జత చేశాడు. ఇలా తన పాత జీన్స్ ను ఉపయోగించి క్రికెట్ కిట్ బ్యాగ్‌గా మార్చుకున్నాడు. ఈ అద్భుతమైన వీడియోను అప్‌లోడ్ చేసిన కొద్ది గంటల్లోనే లక్షల కొద్దీ వ్యూస్ రాబట్టింది. ప్రస్తుతం ఈ వీడియో కోటికి పైగా వ్యూస్ సాధించి ట్రెండ్ అవుతోంది. ఇంకెందుకు ఆలశ్యం మీరు కూడా vఐరాల వీడియోను చూసి మీకేమనిపించిందో ఓ కామెంట్ చేయండి.