చిత్రపరిశ్రమలో హీరోలకు వరుసగా ప్లాప్స్ వచ్చిన వారికొచ్చిన నష్టమేమి ఉండదు. వరుసగా డజను డిజాస్టర్స్ ఇచ్చి కూడా బౌన్స్ బ్యాక్ అయిన హీరోలు ఉన్నారు. కానీ హీరోయిన్స్ పరిస్థితి వేరు. రెండు మూడు ప్లాప్స్ పడితే చాలు ఐరన్ లెగ్ అనే ముద్ర వేస్తారు. తొలి సినిమాతో సూపర్ హిట్స్ అందుకుని ఆ వెంటనే ప్లాప్స్ వస్తే ఇక అంతే సంగతులు. మరోసినిమాలో ఛాన్స్ ఇచ్చేందుకు వంద సార్లు అలోచిస్తారు. ఇటీవల యంగ్ హీరోల స్క్రిప్ట్ సెలక్షన్ కారణంగా ప్లాప్స్ తో హీరోయిన్స్ కెరీర్ త్వరగా కనుమరుగవుతోంది.
షాలిని పాండే : అర్జున్ రెడ్డి వంటి సెన్సేషన్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ జబల్ పూర్ బ్యూటీ 118 తో మరో హిట్ అందుకుంది కానీ ఆ తర్వాత వచ్చిన ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్దం వంటి డిజాస్టర్స్ తో టాలీవుడ్ కు దూరమైంది.
ఆకాంక్ష శర్మ : లైలాతో తెలుగు పరిచయమైన కన్నడ బ్యూటీ ఆ సినిమా డిజాస్టర్ తో కెరీర్ డైలామాలో పడింది.
కృతి శెట్టి : ఉప్పెన సినిమాతో దూసుకొచ్చిన కృతి వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచార్ల నియోజకవర్గం, కస్టడీ వంటి ప్లాప్స్ తో టాలీవుడ్ లో అవకాశాలు నెమ్మదించాయి
సాయి మంజ్రేకర్ : మేజర్ తో మెప్పించిన సాయి.. స్కంద తో డిజాస్టర్.. గని తో అల్ట్రా డిజాస్టర్ కొట్టి దాదాపు అవకాశాలు అన్ని కోల్పోయింది. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఉన్న ఒకే ఒక సినిమా అర్జున్ సన్నాఫ్ విజయంతి.
ఫారియా అబ్దుల్లా : జాతి రత్నాలతో జెట్ స్పీడ్ లో వచ్చిన ఫరియా.. ఆ ఒక్కటి అడక్కు, రావణాసుర, లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్లోప్స్ పడడంతో ఎదో అలా అలా బండిలాగిస్తుంది.
అను ఇమ్మాన్యుయేల్ : నానితో చేసిన మజ్ను సినిమా తప్ప ఈమె కెరీర్ లో హిట్ అంటే చేపలేని పరిస్థితి. ఇప్పుడు తెలుగులో సినిమాలేవి లేక తమిళ్, మలయాళంలో ప్రయత్నాలు చేస్తోంది.
వైష్ణవి చైతన్య : బేబీ తో సెన్సషనల్ హిట్ అందుకున్న ఈ తెలుగు అమ్మాయి.. జాక్ తో డిజాస్టర్ అందుకుంది. ప్రస్తుత్తం అవకాశాలైతే ఉన్నాయి కానీ మరో రెండు మూడు ప్లాప్స్ రాకుండా జాగ్రత్త పడాలి.
ఇలా చెప్పుకుంటూ వెళ్తే లిస్ట్ చాలానే వుంది. హీరోయిన్స్ కథలు వినకుండా సినిమాలు ఓకే చేస్తారా అంటే.. హీరోయిన్స్ చెబితే వినే దర్శకులు, హీరోలు ఎవరంటే ఠక్కున చెప్పలేని పరిస్థితి. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలని వచ్చిన ప్రతి అవకాశన్ని వదులుకోకుదనే భావన హీరోయిన్స్ లో ఉండడం సహజం. యంగ్ హీరోలు రెమ్యునరేషన్ పైనే కాకుండా కథల పైన ద్రుష్టిపెడితే హీరోయిన్స్ కు నాలుగు సినిమాలు అదనంగా వస్తాయి. సినీ కెరీర్ మరికొన్నేళ్లు ఉంటుంది.