భారతదేశంలో ప్రతి సంవత్సరం 1 లక్ష 40 వేల మంది విషపూరిత పాము కాటు కారణంగా మరణిస్తున్నారు. ఈ మరణాలలో ఎక్కువ భాగం సకాలంలో చికిత్స లేకపోవడం వల్ల సంభవిస్తున్నాయి. కానీ కెన్యాలో కనుగొన్న ఒక ఆవిష్కరణ ఇప్పుడు పాము కాటుకు చికిత్సను సులభతరం చేసింది. ఇంట్లోనే తమ శరీరంలోని పాము విషాన్ని సులభంగా తొలగించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
READ MORE: AP Fibernet: ఏపీ ఫైబర్ నెట్ ఉద్యోగులపై సర్కార్ షాకింగ్ నిర్ణయం.. 500 మంది ఇంటికే..!
ఇప్పటివరకు.. భారతదేశంలో పాము కాటుకు విరుగుడుగా యాంటీవీనమ్‌ను ఉపయోగిస్తున్నారు. దీన్ని ఇంజెక్షన్ రూపంలో ఇస్తున్నారు. కాగా.. ఈ-బయోమెడిసిన్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. యూనిథియోల్ అనే ఔషధంతో పాము విషాన్ని తొలగించవచ్చని కెన్యా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇప్పటివరకు దీనిని మెటల్ పాయిజనింగ్ చికిత్సకు ఉపయోగిస్తున్నారు. పాము విషంలో మెటాలోప్రొటీనేస్ అనే ఎంజైమ్ ఉంటుందని, ఇది కణాలను దెబ్బతీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది వ్యాప్తి చెందేందుకు జింగ్ అవసరమట. దీనిని శరీరం నుంచి తీసుకుంటుందట.
READ MORE: Tollywood Directors : బాలీవుడ్ హీరోలతో టాలీవుడ్ డైరెక్టర్లు..
అయితే.. యూనిథియోల్ జింక్ వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటుంది. తద్వారా విషం వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది. ఈ ఔషధాన్ని నీటితో కూడా తీసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇది క్యాప్సూల్ రూపంలో కూడా అందుబాటులోకి రావచ్చట. అయితే.. ఇప్పటివరకు, పాము విషాన్ని తొలగించడానికి తయారు చేసిన అన్ని మందులను నిల్వ చేయడానికి ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత అవసరం. మారుమూల గ్రామాల్లో ఈ ఊష్ణోగ్రతలో నిల్వ చేయడం సాధ్యం కారు. గ్రామాల్లో పాము కాటు వల్ల ఎక్కువ మంది చనిపోవడానికి ఇదే కారణం.
READ MORE: Ajinkya Rahane: అజింక్య రహానే స్వార్థపూరితంగా ఆలోచించాల్సింది: కైఫ్
కానీ.. తాజాగా కనుగొన్న విరుగుడు మందు మాత్రం సాధారణ ఊష్ణోగ్రతలో కూడా నిల్వ ఉండి మెరుగ్గా పని చేస్తుందట. కెన్యాలో 64 మందిపై ఈ ఔషధాన్ని ఉపయోగించారని పరిశోధకులు చెబుతున్నారు. ఈ 64 మందికి పాము కాటు తర్వాత యూనిథియోల్‌ను ఉపయోగించారు. 64 మంది వెంటనే కోలుకున్నారు. వారిపై పాము విష ప్రభావం కనిపించలేదట. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ ఔషధాన్ని ఉపయోగించడానికి ఎటువంటి నిపుణుడు అవసరం లేదట.