Viral Video: సోషల్ మీడియా రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న క్రమంలో ప్రస్తుత కాలంలో కంటెంట్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు విభిన్నమైన ప్రయోగాలు చేస్తున్నారు. జనాలను ఆకర్షించేందుకు కొత్తరకమైన ఆలోచనలతో వీడియోలను రూపొందిస్తున్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో వారి అంచనాలు తారుమారు అవుతున్నాయి. తాజాగా ఓ కంటెంట్ క్రియేటర్‌కు అచ్చం అలాంటి అనుభవమే ఎదురైంది. సాధారణ ఆటోడ్రైవర్‌ను తక్కువ అంచనా వేసి చివరికి షాకయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
వైరల్ఓ వీడియోలో చూపించిన విధంగా.. ఓ యువ కంటెంట్ క్రియేటర్ రోడ్డుపై వెళ్తున్న ఆటోవాలాను ఆపి, తన ఆఫర్ వివరించాడు. తాను అడిగే మూడు ప్రశ్నలకు సరైన సమాధానం చెబితే రూ.500 నగదు ప్రైజ్ ఇస్తానని చెప్పాడు. ఆటోడ్రైవర్ కూడా ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాడు. దానితో కంటెంట్ క్రియేటర్ తొలుత చాలా సులభమైన ప్రశ్నతో ఆటోవాలాను ఉత్సాహపరిచాడు. భారతదేశానికి ఉన్న మరో రెండు పేర్లు చెప్పమని అడగగా.. దానికి ఆటోడ్రైవర్ “భారత్.., హిందుస్థాన్” అని సమాధానం చెప్పాడు. దానితో మరొక ప్రశ్న వేసాడు. భారత్‌లోని ఇద్దరు ప్రముఖ సినీహీరోల పేర్లు చెప్పమని అడిగాడు. దానికి ఆటోడ్రైవర్ ఎలాంటి సందేహం లేకుండా “షారుఖ్, సల్మాన్” అని సమాధానమిచ్చాడు.
Read Also: Milk Price Hike: కర్ణాటకలో పాల ధరల పెంపు.. లీటర్ పాలపై రూ. 4
ఇక ఇప్పటి వరకు ఆటోడ్రైవర్ సులభంగా సమాధానం చెప్పడంతో, కంటెంట్ క్రియేటర్ అతడిని ముప్పుతిప్పలు పెట్టేలా మూడో ప్రశ్నను అడిగాడు. అందుకోసం “న్యూటన్ మూడో నియమం చెప్పండి” అని ప్రశ్నించాడు. అయితే, ఆటోడ్రైవర్ ఊహించని విధంగా ఆ సిద్ధాంతాన్ని ఇంగ్లీష్‌లో “For every action, there is an equal and opposite reaction” స్పష్టంగా చెప్పాడు. దీన్ని విన్న కంటెంట్ క్రియేటర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ తర్వాత అతడు తేరుకునేలోపే ఆటోడ్రైవర్ అతడి చేతిలోని రూ.500ని లాగేసుకున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.