ప్రభాస్ తన అభిమానులకు ఒక ప్రామిస్ చేశాడు . ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా రిలీజ్ చేస్తానని అన్నాడు. అందుకుతగ్గట్టే వరుస సినిమాలు చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ కల్కితో మెప్పించిన డార్లింగ్ చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలున్నాయి. వీటిలో ముందుగా మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ రిలీజ్ కావాల్సి ఉంది. అప్పుడెప్పుడో ఈ సినిమాను సైలెంట్‌గా మొదలు పెట్టి పోస్టర్స్, మోషన్ పోస్టర్‌తో మెల్లిగా హైప్ క్రియేట్ చేశారు. మొదట్లో మారుతితో సినిమా వద్దని చెప్పిన అభిమానులే ఇప్పుడు రాజాసాబ్ కావాలి అనేలా చేశారు. ఇలాంటి సమయంలో రాజాసాబ్ రిలీజ్ చేస్తే అదిరిపోతుంది.
Also Read : Ivana : టాలీవుడ్ లక్ పరీక్షించుకోనున్న కోలీవుడ్ బ్యూటీ..
మేకర్స్ కూడా ఏప్రిల్ 10న ‘ది రాజాసాబ్’ను రిలీజ్ చేస్తామని అన్నారు. కట్ చేస్తే ఇప్పుడు రాజాసాబ్ సౌండే లేకుండా పోయింది. అసలు షూటింగ్ ఎంతవరకు వచ్చింది? ప్రజెంట్ ఏం చేస్తున్నారనే వివరాలేవి చెప్పడం లేదు. ఇలాగే ఉంటే రాజాసాబ్ పై ఉన్న బజ్ కాస్త పోయేలా ఉంది. ఎలాగు సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. కానీ కొత్త రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయడం లేదు. ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా అప్సెట్ అవుతున్నారు.అయితే ఈ ఇప్పుడు లేటెస్ట్ గా మరో న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. రాజాసాబ్ ఇంకా సాంగ్స్ షూట్ ఉందని అవి ఫినిష్ అయ్యేసరికి చాలా టైమ్ పడుతుందని అసలు ఈ ఏడాది రిలీజ్ ఉండకపోవచ్చని వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయినా ఆశ్చర్యం లేదని వినిపిస్తోంది. అభిమానుల సహనానికి పరీక్ష పెట్టేలా చేస్తున్నారు రాజాసాబ్ మేకర్స్ ఇప్పటికైనా అప్డేట్స్ ఇస్తాడేమో లేదో చూడాలి.