Pooja Hegde : బుట్టబొమ్మ పూజాహెగ్డే నుంచి సినిమాలు వచ్చి చాలా రోజులు అవుతోంది. తెలుగులో ఆమె సినిమాలు రావట్లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమాలు చేసుకుంటోంది. ఒక తుఫాన్ లాగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఎంత త్వరగా ఎదిగిందో.. అంతే త్వరగా టాలీవుడ్ కు దూరం అయిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాల్లో బిజీగా ఉంటోంది. అయితే ఆమె తాజాగా సోషల్ మీడియాలో ఫాలోవర్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. సెలబ్రిటీలను సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారందరూ థియేటర్లకు రారు అంటూ చెప్పింది. సోషల్ మీడియా ఫాలోవర్లకు.. థియేటర్ ఫ్యాన్స్ కు చాలా తేడా ఉంటుందని చెబుతోంది.
Read Also : Trivikram: త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి తమిళ్ స్టార్ హీరో షాక్?
‘నాకు ఇన్ స్టాలో 27 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. వారంతా నా సినిమాలు చూసేందుకు థియేటర్లకు రారు. ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు అభిమాని కూడా కాకపోవచ్చు. చాలా మంది సూపర్ స్టార్లకు సోషల్ మీడియాలో 5 మిలియన్ల కంటే తక్కువ మందే ఫాలోవర్లు ఉంటారు. కానీ వారి సినిమాలకు కోట్లాది మంది వస్తుంటారు. కాబట్టి ఫాలోవర్లు ఎక్కువ ఉన్నంత మాత్రాన వారంతా మన కోసం వస్తారని కాదు’ అంటూ చెప్పుకొచ్చింది పూజాహెగ్డే. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పూజాహెగ్డే చేసిన సినిమాల్లో చాలా వరకు బ్లాక్ బస్టర్లు కూడా ఉన్నాయి. అలాగే దారుణమైన ప్లాపులు కూడా ఉన్నాయి. వాటి నేపథ్యంలోనే ఆమె ఇలాంటి కామెంట్ చేసి ఉండొచ్చు.