Kushboo : సీనియర్ నటి ఖుష్బూ ట్రోలర్స్ మీద ఫైర్ అయ్యారు. రీసెంట్ గా ఆమె కొత్త లుక్ లోకి మారిపోయింది. సన్నబడిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో కొందరు ప్రశంసలు కురిపించారు. ఇంకొందరు మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు. ఆమె ఇంజెక్షన్లు వేయించుకుంది కాబట్టే ఇలా మారిపోయింది అంటూ కామెంట్లు, పోస్టులు చేశారు. దీంతో ఖుష్బూ సీరియస్ అయ్యారు. తాజాగా వారిపై ఓ పోస్టు పెట్టారు. మీరు అసలు మనుషులేనా అంటూ ఆమె కామెంట్ చేయడం సంచలనం రేపుతోంది. తాను ఏది చేసినా రియల్ ఫేస్ తోనే చేస్తానంటూ ఆమె చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Read Also : Pawan Kalyan: మార్క్ శంకర్ పై అనుచిత వ్యాఖ్యలు.. అల్లు అర్జున్ ఫ్యాన్ అరెస్ట్..!
‘నేను ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదు. నేచురల్ గానే మారాను. కానీ కొందరికి నిజమైన ముఖం చూపించే ధైర్యం ఉండదు. ఎందుకంటే వారు చాలా అసహ్యంగా ఉంటారు. సోషల్ మీడియాలో ముఖం చూపించే ధైర్యం లేని వాళ్లే ఇలా ట్రోల్స్ చేస్తారు. వాళ్లు అసలు ఎలా ఆలోచిస్తారు. మీ తల్లిదండ్రులను చూస్తే జాలేస్తోంది’ అంటూ ఖుష్బూ కౌంటర్ ఇచ్చింది. ఖుష్బూకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతకు ముందు కొంచెం బొద్దుగా ఉన్న ఖుష్బూ.. ఇప్పుడు కాస్త సన్నబడిపోయింది. ఖుస్బీ ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోవడం చూసి ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.