AP Nominated Posts: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వరుసగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ వస్తున్నారు.. నామినేటెడ్ పోస్టుల్లో సింహ భాగం తెలుగుదేశం పార్టీ నేతలకు.. ఆ తర్వాత జనసేన నేతలకు.. కొన్ని భారతీయ జనతా పార్టీ నేతలకు కేటాయిస్తున్న విషయం విదితమే కాగా.. తాజాగా, 30 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించింది టీడీపీ.. అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా నేతలు చెబుతున్నారు.. ప్రకటించిన 30 ఏఏంసీ చైర్మన్ల పదవుల్లో 25 టీడీపీ, 4 జనసేన, 1 బీజేపీ నాయకులకు దక్కాయి. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల చైర్మన్లను ప్రకటిస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు..
తాజాగా ప్రకటించిన 30 మార్కెట్ కమిటీలు.. చైర్మన్ల పేర్లను కింది లిస్ట్‌లో పరిశీలించవచ్చు..