Bhatti Vikramarka : ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సమక్షంలో హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ రూరల్ డెవలప్మెంట్ సంస్థలో TG REDCO తో రెండు సంస్థలు ఎంఓయూ చేసుకున్నాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సన్ పేట్రో 20 వేల కోట్ల పెట్టుబడి పెట్టారని, రెండు కంపెనీలు 27 వేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారన్నారు. సీఎం దావోస్ పర్యటనలో ఈ ఒప్పందం కుదిరిందని ఆయన తెలిపారు.
Raj Tarun : రాజ్ తరుణ్ పేరెంట్స్ ను ఇంట్లో నుంచి గెంటేసిన లావణ్య
పవర్ 17,162 మెగావాట్ల కు డిమాండ్ చేరిందని, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సప్లై చేసిందన్నారు భట్టి విక్రమార్క. భవిష్యత్ అభివృద్ధి చూసి..పవర్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని, 2029 కి రాష్ట్రంలో 24,215 మెగావాట్ల కి విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. వాటికి అనుగుణంగా పవర్ జనరేషన్ కి ప్లాన్ చేస్తున్నామని, గ్రీన్ ఎనర్జీ వైపు ప్లాన్ చేస్తున్నామని ఆయన తెలిపారు. 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ అందుబాటులో తేవాలని చూస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. సన్ పెట్రో కంపెనీ 3400 మెగావాట్లతో పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కోసం రూ.20 వేల కోట్లు పెట్టబడులు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు.
Bhatti Vikramarka : ఒడిశాలో నైనీ గని ప్రారంభం.. సింగరేణికి జాతీయ విస్తరణలో కొత్త అధ్యాయం