ఐపీఎల్ 2025లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా బరిలోకి దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఈమ్యాచ్ గెలవాలంటే రాజస్థాన్ 189 పరుగులు సాధించాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ పోరెల్(49) అత్యధిక పరుగులు సాధించాడు. కేఎల్ రాహుల్(38), అక్షర్ పటేల్ (34), ట్రిస్టన్ స్టబ్స్ (33) రాణించగా.. అశుతోష్ శర్మ (15) పరుగులు సాధించాడు.
READ MORE: Off The Record : ఆ TDP నేత కన్నెర్రజేస్తే ఎలాంటివారి పొలిటికల్ లైఫ్ అయినా ఫట్టా?
ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ కు మూడో ఓవర్ లోనే తొలి ఎదురుదెబ్బ తగిలింది. ఫ్రేజర్ మెక్‌గుర్క్ 6 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. అనంతరం కరుణ్ నాయర్ రనౌట్ అయి పెవిలియన్‌కు తిరిగి వచ్చాడు. మూడో వికెట్‌లో రాహుల్ 32 బంతుల్లో 38 పరుగులు చేసి ఔటయ్యాడు. అభిషేక్ పోరెల్ 37 బంతుల్లో 49 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. అక్షర్ పటేల్ (34; 14 బంతుల్లో) దూకుడుకు తీక్షణ చెక్ పెట్టాడు. చివరగా ట్రిస్టన్ స్టబ్స్ (33), అశుతోష్ శర్మ (15) నెట్టుకొచ్చారు. మరోవైపు.. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2, మహీశ్ తీక్షణ, వానిందు హసరంగ ఒక్కో వికెట్ పడగొట్టారు.