AP Crime: డబ్బులు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.. అయితే, ఈజీగా డబ్బులు సంపాదించడం.. జల్సాలు చేయడానికి అలవాటు పడి.. కొందరు తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు.. అందులో భాగంగా మాయమాటలు చెప్పేవాళ్లు… అమ్మాయిలను ట్రాప్ చేసి ముగ్గులోకి దింపేవారు… అమ్మాయిల న్యూడ్ వీడియోలను బ్యాన్ చేసిన పోర్న్ వెబ్ సైట్లకు అమ్ముకుంటూ లక్షలకు లక్షలు సంపాదించేవారు… ఇలాంటి ఓ దుర్మార్గపు గ్యాంగ్ ఆట కట్టించారు సైబర్ సెక్యూరిటీ పోలీసులు.
Read Also: IPL 2025 : ఐపీఎల్ 2025లో ఫిక్సింగ్ ముప్పు.. హైదరాబాద్ వ్యాపారవేత్తపై బీసీసీఐ అలర్ట్
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పల్లె గణేష్, తులగపు జ్యోత్నది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం. ఉద్యోగం కోసం బెగళూరు వెళ్లారు. వీరికి అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన లూయిస్ తో పరిచయం ఏర్పడింది. లూయిస్ గుంతకల్లులో కాల్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ముగ్గురూ కలిసి ఈజీగా డబ్బు సంపాదించడంపై దృష్టిపెట్టారు. పోర్న్ వెబ్ సైట్లకు అమ్మాయిల వీడియోలు అమ్మితే భారీగా డబ్బులు వస్తాయని భావించారు. అంతే అప్పటినుంచి అమాయక అమ్మాయిలను ట్రాప్ చేయడం మొదలుపెట్టారు. కాల్ సెంటర్ కు వచ్చే అమ్మాయిలను మాయమాటలు చెప్పి ట్రాప్ చేసేవాడు. గణేష్, జ్యోత్నలు కూడా బెంగళూరులో అమ్మాయిలను ట్రాప్ చేసేవారు. వీళ్లు ఒక స్టూడియో సెటప్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. తమ ట్రాప్ లో పడిన అమ్మాయిలతో న్యూడ్ వీడియోలు తీసేవారు. సైప్రస్ కు చెందిన ఎక్స్ యాంపస్టర్ అనే పోర్న్ వెబ్ సైట్ తో లింక్ పెట్టుకున్నారు. ఈ పోర్న్ సైట్ ఇండియాలో బ్యాన్ చేశారు. అయితే వీరు మాత్రం యూఆర్ఎల్ లింక్ ద్వారా పోర్న్ వెబ్ సైట్ లోకి అమ్మాయిల న్యూడ్ వీడియోలను పంపించేవారు. ఈ వెబ్ సైట్ లో లైవ్ వీడియోలను కూడా పెట్టేవారు. ఇలా అమ్మాయిల న్యూడ్ వీడియోలు, లైవ్ లో న్యూడ్ వీడియోలు పెట్టడం ద్వారా భారీగా సంపాదించేవారు. అయితే సైబర్ సెక్యూరిటీ పోలీసులకు వచ్చిన సమాచారంతో అలర్ట్ అయ్యారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. డబ్బులకోసం అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారని, వారి న్యూడ్ వీడియోలను లైవ్ లో పెట్టేందుకు ఏకంగా స్టూడియో ఏర్పాటు చేశారని దర్యాప్తులో తేలింది. ఇప్పటికే ఎక్స్ యాంపస్టర్ పోర్న్ వెబ్ సైట్ లో అనేక వీడియోలు, అమ్మాయిలతో లైవ్ లు కూడా ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.
Read Also: IPL 2025 : ఐపీఎల్ 2025లో ఫిక్సింగ్ ముప్పు.. హైదరాబాద్ వ్యాపారవేత్తపై బీసీసీఐ అలర్ట్
బ్యాన్ చేసిన ఎక్స్ యాంపస్టర్ పోర్న్ వెబ్ సైట్ కు అమ్మాయిల అశ్లీల వీడియోలు పెట్టడం ద్వారా నిందితులు గణేష్, జ్యోత్న, లూయిస్ లు లక్షల్లో సంపాదించారని పోలీసుల విచారణలో తేలింది. గణేష్, జ్యోత్నలు 16 లక్షలు, లూయిస్ 11 లక్షలు పోర్న్ వీడియోలు సంపాదించినట్లు సైబర్ సెక్యూరిటీ పోలీసులు గుర్తించారు. ఈ డబ్బులను క్రిప్టో కరెన్సీ, వీడీఏ రూపంలో వచ్చేవన్నారు. ఈ డబ్బులను నిందితుల ఎకౌంట్లోకి సైప్రస్ కు చెందిన టెక్నోఇస్ లిమిటెడ్ కంపెనీ ద్వారా వచ్చాయని గుర్తించామన్నారు. ఇల్లీగల్ గా అమ్మాయిల న్యూడ్ వీడియోలు, అమ్మాయిలతో న్యూడ్ లైవ్ లు పోర్న్ వెబ్ సైట్లకు అమ్మడం ద్వారా ఇంకా ఎక్కువే సంపాదించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతోపాటు ఈ డర్టీ గ్యాంగ్ ఎంతమంది అమ్మాయిలను ట్రాప్ చేసి న్యూడ్ వీడియోలను పోర్న్ వెబ్ సైట్లలో అప్ లోడ్ చేశారో గుర్తించే పనిలో పడ్డామంటున్నారు. సైబర్ స్పేస్ ఎక్కువగా దుర్వినియోగమవుతుందంటున్నారు పోలీసులు. కొంతమంది సైబర్ స్పేస్ లో నేరాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోయాయంటున్నారు. అందుకే సైబర్ క్రైం టీంలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. సైబర్ నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉన్నాయంటున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సోషల్ మీడియాను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలన్నారు. సైబర్ మోసాలకు గురైనవారు వెంటనే 1930ను సంప్రదించాలని సూచిస్తున్నారు..