ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) ఏకంగా రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ సీజన్ ఆరంభం నుంచి యూజీ తనదైన ముద్ర వేయలేకపోయాడు. మొదటి 5 మ్యాచ్‌లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు. అంతేకాదు కొన్ని మ్యాచ్‌లలో ధారాళంగా పరుగులు కూడా ఇచ్చాడు. అయినా కూడా పంజాబ్ మేనేజ్‌మెంట్ అతడిపై నమ్మకం ఉంచింది. ఆ నమ్మకాన్ని మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిలబెట్టుకున్నాడు.
యజువేంద్ర చహల్ తన మణికట్టు స్పిన్ మాయాజాలంతో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కాకళావికలం చేశాడు. చహల్ దెబ్బకు అజింక్య రహానే (17), అంగ్‌క్రిష్ రఘువంశీ (37), రింకూ సింగ్ (2), రమణ్‌దీప్ సింగ్ (0)లు పెవిలియన్ చేరారు. తన 4 ఓవర్ల కోటాలో 4 వికెట్లు పడగొట్టి 28 రన్స్ మాత్రమే ఇచ్చాడు. పంజాబ్ 112 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో చహల్‌దే కీలక పాత్ర. చివరి వికెట్ పడగానే పంజాబ్ జట్టు యజమాని ప్రీతి జింటా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. స్టాండ్స్‌లో గంతులేస్తూ, కేరంతలు కొడుతూ తెగ సంతోషపడిపోయారు. ఈ క్రమంలోనే చాహల్‌ను గట్టిగా హత్తుకుని అభినందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘చహల్ సూపర్’, ‘చహల్ భలే ఛాన్స్ కొట్టేశాడు’ అంటూ ఫాన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
Preity Zinta was really happy with performance of Punjab Kings Today.
congrats @PunjabKingsIPL for a thriller victory. pic.twitter.com/iNvuXm6TJB— 𝐂𝐚𝐩𝐭𝐚𝐢𝐧🧛 (@hiit_man45) April 15, 2025