వైసీపీకి అత్యంత లాయల్ అని పేరున్న ఆ ఫ్యామిలీ… ఇప్పుడు షాకివ్వబోతోందా? ఫ్యాన్ కింది నుంచి పక్కకు జరిగిపోవాలని ఆ కుటుంబ పెద్ద డిసైడయ్యారా? నాడు ఏ పార్టీ అధ్యక్షుడినైతే ఓడించాడో… అదే పార్టీలోకి వెళ్ళే ప్లాన్‌లో ఉన్నారా? ఎవరా ఎక్స్ జెయింట్ కిల్లర్? ఏంటా జంపింగ్ స్టోరీ? గాజువాక నియోజకవర్గం రాజకీయాలు తొలి నుంచి భిన్నమే. ఇక్కడ వ్యక్తుల చరిష్మా, పార్టీల ఈక్వేషన్ల కంటే స్ధానికతకే ప్రాధాన్యత ఎక్కువ. మొదటి నుంచి తిప్పల, పల్లా ఫ్యామిలీలదే గాజువాకలో ఆధిపత్యం. ఈ హవాకు 2009లో గండి కొట్టింది ప్రజారాజ్యం. 2019లో జనసేన కూడా అదే ప్రయత్నం చేసిందిగానీ సక్సెస్ అవలేకపోయింది. పవన్ కల్యా ణ్ నేరుగా పోటీకి దిగడంతో అప్పట్లో ఇక్కడ హైవోల్టేజ్ రాజకీయ వాతావరణం కనిపించింది. పవన్ సునాయాసంగా గెలుస్తారని నాడు గ్లాస్ పార్టీ కేడర్ అనుకున్నా… ఫలితం మాత్రం షాకింగ్ ఎక్స్ పీరియన్స్ మిగిల్చింది. తొలిసారి పోటీలోనే జనసేనానికి ఓటమిని పరిచయం చేసింది గాజువాక. ఆయన మీద గెలిచి జెయింట్ కిల్లర్ ఇమేజ్ సాధించారు తిప్పల నాగిరెడ్డి. ఆ ఎన్నికల్లో వైసీపీ సునామీ ఎంత చర్చనీయాంశమైందో…..అదే స్ధాయిలో పవన్ కల్యాణ్ పరాజయం మీద కూడా విశ్లేషణలు నడిచాయి. ఈసారి కూడా కూటమి కుదురుకోక ముందు గాజువాక సీటు జనసేనదేనని….ఇక్కడ గెలిచి తీరతామని ప్రకటించారు పవన్ కల్యాణ్. కానీ… కూటమి కట్టాక ఈక్వేషన్స్ మారిపోయాయి. ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పల్లా శ్రీనివాస్ రాష్ట్రంలోనే రికార్డు మెజారిటీ సాధించారు. ఇక్కడ 95 వేలకుపైగా మెజార్టీ రావడం వెనక జనసేన కేడర్ కసికసిగా పనిచేసిన ప్రభావం ఉందని అంటారు పరిశీలకులు. అదే సమయంలోనాడు పవన్ కల్యాణ్‌ని ఓడించిన తిప్పల నాగిరెడ్డికి కూడా వైసీపీ అధినాయకత్వం షాకిచ్చింది. సిట్టింగ్ సీట్లో పోటీకి ఛాన్స్ దక్కలేదు ఆయనకు. దీంతో తిప్పల వర్గం తిరుగుబాటు జెండా ఎగరేసింది. అప్పటి నుంచి వైసీపీ హైకమాండ్‌కు, తిప్పల ఫ్యామిలీకి మధ్య దూరం పెరిగింది. అయినా అసంతృప్తిని ఎక్కడా బయటపడనీయకుండా… టైం చూసి దెబ్బ కొట్టారు నాగిరెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో రకరకాల లెక్కలేసి…మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్‌ని వైసీపీ బరిలో దింపగా తిప్పల వర్గం సహకరించలేదన్న టాక్ నడిచింది. ఇక ఎన్నికల తర్వాత తిరిగి గాజువా క ఇన్చార్జ్ బాధ్యతలు నాగిరెడ్డి కుమార్డు దేవన్ కు అప్పగించింది వైసీపీ అధిష్టా నం.
వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఖాయమని భరోసా ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. అయినాసరే.. తిప్పల ఫ్యామిలీలో అసంత్రుప్తి మాత్రం చల్లారలేదని ఇటీవల పరిణామాలను బట్టి అర్ధం అవుతోందంటున్నారు పరిశీలకులు. అనూహ్యంగా నాగిరెడ్డి మరో కుమారుడు,74వ వార్డు కార్పొరేటర్ వంశీ పార్టీ ఫిరాయించారు. గ్రేటర్ మేయర్‌పై అవిశ్వాసాన్ని వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తరుణంలో జరిగిన ఈ మార్పు ఫ్యాన్ పార్టీకి పెద్ద షాకేనని అంటున్నారు. అధిష్టానం తమకు నమ్మకమైన కుటుంబం అనే అభిప్రాయంతో వుంటే హైడ్రామాకు తెరలేపారన్న చర్చ జరుగుతోంది. కూటమి ఎమ్మె ల్యేలతో విస్త్రత చర్చల తర్వాత టీడీపీ కండువా కప్పుకున్నారు వంశీ. ఇక్కడితో ఈ వ్యవహారం ముగిసివుంటే తండ్రి, కొడుకు వేరువేరు పార్టీలైతే తప్పే ముందనే డిస్కషన్ తో ఆగిపోయి వుండేది. కానీ, అందుకు భిన్నంగా వంశీ జనసేనలో చేరేందుకు రెడీ అయ్యారు. అది కూడా తమ కుంటుంబ రాజకీయ గురువు , అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సమక్షంలో కావడం ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్. కూటమిలో చేరేందుకు సిద్ధమైన సమయంలోనూ వైసీపీ తమను అవమానించిందని, పవన్ కల్యాణ్ వంటి నేత మీద గెలిచిన తన తండ్రికే అవకాశం ఇవ్వకపోవడం వెనుక అప్పటి ముఖ్యనేతల హస్తం వుందని వాపోయినట్టు తెలిసింది. అవకాశం కోసం ఎదురు చూసి ఇప్పు డు పార్టీ మారినట్టు చెప్పారట వంశీ. దీంతో నాగిరెడ్డి ఫ్యామిలి పొలిటికల్ జర్నీపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తేడాపడితే… గాజువాకలో వైసీపీకి సంస్ధాగతంగా ఇబ్బందులు తప్పక పోవచ్చని అంటున్నారు. ఆ సంగతి ఎలా ఉన్నా… నాగిరెడ్డి ఫ్యామిలీ మాత్రం జనసేన గూటికి చేరడం ఖాయమన్న వాదన బలపడుతోంది. కొడుకుల రాజకీయ భవిష్యత్ కోసం నిర్ణయం తీసుకోవడానికి నాగిరెడ్డి వెనుకాడాల్సిన అవసరం లేదని అంటున్నారు ఆయన సన్నిహితులు. మొత్తంగా కొడుకు గీత దాటేశాడు కనుక మొత్తం కుటుంబం అటు ప్రయాణిస్తుందా లేకరాజకీయంగా అవకాశం కల్పించిన ఫ్యాన్ కిందనే వుండి భవిష్యత్ వెతుక్కుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.