టాలీవుడ్ లో ఒకప్పటి హిట్ సాంగ్స్ ను రీమేక్ చేయడం సాధారణమైన విషయమే.. కానీ ఒకప్పటి సూపర్ హిట్ సినిమాల టైటిల్స్ ను కూడా మరోసారి తమ సినిమాలకు వాడుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని సినిమాలు సూపర్ హిట్ కాగా మరికొన్ని ప్లాప్స్ గా మారాయి. అవేంటో ఓ సారి చూసేద్దాం రండి..
1. ఎన్టీఆర్.. ప్రభాస్.. అడవి రాముడు..
ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగెస్ట్ మాస్ హిట్ అడవి రాముడు.. అదే పేరుతో అదే దర్శకుడుతో ప్రభాస్ చేసిన ఈ సినిమా యావరేజ్ ఫలితాన్ని రాబట్టింది..
2 : ఎన్టీఆర్.. వెంకటేష్… మల్లీశ్వరి..
ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి
3. రాజేంద్ర ప్రసాద్, యంగ్ టైగర్.. బృందావనం
రెండు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి.. ఈ సినిమాతో ఎన్టీఆర్ కు లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది..
4. అక్కినేని నాగేశ్వరరావు.. మహేశ్ బాబు.. శ్రీమంతుడు
అక్కినేని హిట్ సినిమా టైటిల్ తో వచ్చిన మహేశ్ బాబు సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతోనే మహేశ్ బాబు సొంత నిర్మాణ సంస్టను ఏర్పాటు చేసారు
5. ANR.. RAPO.. దేవదాసు
అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దేవదాసు సినిమా టైటిల్ తో వచ్చిన రామ్ పోతినేని తోలి సినిమాతోనే సిల్వర్ జూబ్లీ హిట్ అందుకున్నాడు.
6. నాగార్జున.. అంజలి.. గీతాంజలి
నాగార్జున మణిరత్నం కాంబోలో వచ్చిన ఈ సూపర్ హిట్ సినిమా టైటిల్ తో నటి అంజలి లీడ్ రోల్ లో వచ్చిన ఈ సినిమా హిట్ గా నిలిచింది.
7. పవన్ కళ్యాణ్.. విజయ్ దేవరకొండ.. ఖుషి
పవన్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఖుషి.. అదే టైటిల్ పెట్టుకున్న విజయ్ మాత్రం ప్లాప్ కొట్టాడు..
8. కే విశ్వనాథ్.. నిఖిల్.. శంకరాభరణం
సోమయాజులు లీడ్ రోల్ లో వచ్చిన ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ కాగా.. నిఖిల్ సినిమా డిజాస్టర్ తెచ్చుకుంది..
9. కమల్ హాసన్.. వరుణ్ సందేశ్.. మరో చరిత్ర
అప్పట్లో ఒక బెంచ్ మార్క్ సినిమా మరోచరిత్ర.. కానీ వరుణ్ సందేశ్ అదే టైటిల్ తో ప్లాప్ అందుకున్నాడు..
10. బాలయ్య.. శర్వానంద్.. నారి నారి నడుమ మురారి
మాస్ హీరో బాలయ్య ఒక్క ఫైట్ కూడా లేకుండా చేసిన ఈ సూపర్ హిట్ సాదించింది.. శర్వానంద్ సినిమా రిలీజ్ కావాల్సిఉంది..
11. శ్రీకాంత్.. తనయుడు రోషన్.. పెళ్లి సందడి..
అటు తండ్రి ఇటు తనయులకు ఈ సినిమా హిట్ గా నిలవడమే కాకుండా కెరీర్ కు బూస్ట్ నిచ్చింది..
ఇవే కాకుండా మిస్సమ్మ,శక్తి, తొలిప్రేమ, అక్కడమ్మాయిఇక్కడబ్బాయి, ఆరాధన, ముగ్గురు మొనగాళ్లు, ఇద్దరు మిత్రులు, ఆడాళ్ళు మీకు జోహార్లు, మోసగాళ్లకు మోసగాడు, ఆ ఒక్కటి అడక్కు వంటి ఎన్నో పాత టైటిల్స్ తో సినిమాలు వచ్చాయి. వాటిలో చాలా వరకు ప్లాప్స్ గా నిలిచాయి.