సినిమాపై ఫ్యాషన్, పిచ్చితో దర్శకులుగా మారిన ఫిల్మ్ మేకర్లకు కెరీర్ స్టార్టింగ్‌లోనే అభిమాన హీరోలకే యాక్షన్ కట్ చెప్పే అవకాశం వస్తే.. తమ ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఎలా ఉంటుందో చూపించారు తమిళ దర్శకులు కార్తీక్ సుబ్బరాజ్, లోకేశ్ కనగరాజ్, అధిక్ రవిచంద్రన్. కోలీవుడ్ స్టార్ హీరోస్ రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్ కుమార్.. ఫ్యాన్ బాయ్స్‌తో హిట్స్ కొట్టేస్తున్నారు.
కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్.. రజనీకాంత్‌కు వీరాభిమాని. పిజ్జాతో కెరీర్ స్టార్ట్ చేసిన కార్తీక్‌కు.. పెట్టా రూపంలో సూపర్ స్టార్‌ను డీల్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. తెరపై తలైవాను ఎలా చూడాలని అనుకున్నాడో.. అలాగే చూపించడంతో.. బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రూ. 160 కోట్లతో నిర్మించిన సినిమా రూ. 250 కోట్లను క్రాస్ చేసింది.
కెరీర్ ఫేడవుటవుతున్న కమల్ హాసన్‌ను ఇండస్ట్రీలో తిరిగి నిలబెట్టాడు ఆయన ఫ్యాన్ లోకేశ్ కనగరాజ్. తన ఫేవర్ హీరో కమల్ నుండి తనకు కావాల్సిన అవుట్ పుట్ తీసి విక్రమ్ రూపంలో ప్రేక్షకుల ముందుకు ఉంచితే బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్. ఉళగనాయగన్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది విక్రమ్. సుమారు రూ. 500 క్రోర్ వసూళ్లను రాబట్టుకుందని కోలీవుడ్ టాక్. కమల్ హాసన్ నేవర్ బిఫోర్ అనే రేంజ్ లో సినిమా ఇచ్చాడు లోకేష్.
అజిత్‌కు డై హార్ట్ ఫ్యాన్ అయిన అధిక్.. గుడ్ బ్యాడ్ అగ్లీతో తలాకు యాక్షన్, కట్ చెప్పే అవకాశాన్ని కొల్లగొట్టాడు. ఏప్రిల్ 10న రిలీజైన ఈ సినిమాతో అజిత్ గట్టి కంబ్యాక్ కొట్టాడు. ఫ్యాన్స్ కోరుకున్న ఎలిమెంట్స్ సినిమాలో ఉండటంతో ఇది కదా తలా నుండి కోరుకుంటుందని కాలర్ ఎగరేస్తున్నారు. దీంతో కోలీవుడ్ సీనియర్ హీరో ప్రభు అల్లుడు అనే ట్యాగ్ తొలిగించినట్లయ్యింది అధిక్‌కు. ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతున్న ఈ సినిమా ఫైనల్ రన్ లో భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది.
మొత్తానికి ఫ్యాన్ బాయ్స్ తమ ఫేవరేట్ హీరోలు ఎలా ఉండాలో ఓ ఫ్యాన్‌గా ఆలోచించి తీయడంతో సక్సీడ్ అవుతున్నారు. ఈ సక్సెస్ చూసి.. మరి కొంత మంది స్టార్ హీరోలు.. తమ ఫ్యాన్స్ అయిన దర్శకులకు అవకాశమిస్తారేమో చూడాలి.