ఆ మాజీ ఎంపీ హాఫ్ బాయిల్డ్ పాలిటిక్స్ చేస్తున్నారా? తన ఓవరాక్షన్‌తో మొత్తంగా పార్టీనే ఇరుకున పెట్టేశారా? ఆయన అతి కారణంగా….. ఎఫెన్స్‌లో ఉండాల్సిన చోట వైసీపీ డిఫెన్స్‌లోకి పడిపోయిందా? ప్రశ్నించాల్సిన, నిలదీయాల్సిన చోట సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితికి వెళ్ళిపోయిందా? ఎవరా ఎంపీ? ఎలా ఇరుకున పెట్టారు పార్టీని? ఒక్కసారి ఎంపీ మీదికి మీసం మెలేసి ఓవర్ నైట్‌లో పాపులర్ అయిన మాజీ పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్. ఆ దూకుడు చూసే…. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఏరికోరి ఆయనకు ఎంపీ టిక్కెట్ ఇచ్చినట్టు చెప్పుకుంటారు. ఇక పార్టీ అధికారంలో ఉండి, తాను ఎంపీగా పనిచేసినప్పుడు కూడా మాధవ్ చేసిన సర్కస్ ఫీట్స్‌ని కూడా చూసీ చూడనట్టే వదిలేశారని అంటారు. ఇప్పుడు అదే పార్టీకి శాపమైందని, అత్యంత కీలకమైన విషయంలో పైచేయి సాధించాల్సిన చోట సంజాయిషీలు ఇచ్చుకోవాల్సి వస్తోందన్న చర్చ జరుగుతోందట వైసీపీలో. కేవలం మాజీ ఎంపీ మాధవ్ చేసిన ఓవరాక్షన్ కారణంగానే… ఈ పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే ఉందని అంటున్నారు. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా… బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యమన్న వైఖరి మంచిదే అయినా…. ఆ బుల్లెట్ దిగరాని చోట దిగడమే అసలు సమస్య అంటున్నారు వైసీపీ లీడర్స్. జగన్ భార్య భారతిని సోషల్ మీడియాలో దూషించిన కేసులో సొంత ఐ టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీడీపీ. పోలీసులు కూడా కిరణ్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. సరిగ్గా ఇక్కడే… సడన్ ఎంట్రీ మేటర్ మొత్తాన్ని డైవర్ట్ చేసి రచ్చ చేశారు గోరంట్ల మాధవ్. ప్రస్తుతం వైసీపీ లీడర్స్‌లో ఇదే అభిప్రాయం ఉందట. అరెస్టు చేసిన కిరణ్‌ను ఎస్పీ ఆఫీస్‌కు తరలిస్తున్న టైంలో వెంటపడ్డారు మాధవ్. గుంటూరు చుట్టుగుంట సెంటర్‌లో పోలీస్ కాన్వాయ్‌కి అడ్డుపడటం, కిరణ్‌పై దాడికి యత్నించటం, పోలీసులు అడ్డుకోవడం, వెనుకున్న అనుచరులు మొబైల్స్‌లో వీడియోలు తీయడంతో… కథ, స్క్రీన్ ప్లే అంతా మనం అనుకున్నట్టే ఉందని మురిసిపోయారట మాధవ్. ఆ వీడియోల్ని పార్టీ పెద్దలకు చూపించి మార్కులు కొట్టేయాలన్నది ఆయన ప్లాన్‌గా చెప్పుకుంటున్నారు. కానీ… స్క్రీన్ ప్లే బాగుందని మాధవ్ అనుకున్నా… ఫైనల్‌గా తెరమీదికి వచ్చేసరికి అట్టర్ ఫ్లాప్ అయిందట. పైగా పార్టీనే డిఫెన్స్‌లో పడేసిందన్న అభిప్రాయం బలంగా ఉంది. చివరికి టీడీపీ కార్యకర్త కిరణ్ చేసిన పనిని హైలైట్ చేసే బదులు మాధవ్‌ని సమర్ధించుకోవడంతోనే సరిపోతోందని తలలు పట్టుకుంటున్నారట పార్టీ పెద్దలు. కిరణ్‌ను కొట్టే సమయంలో పోలీసులపై దాడి చేశారంటూ….మాధవ్ మీద కేసు బుక్ అయింది. దానికి సంబంధించి ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్నారాయన. అరెస్ట్, కోర్ట్‌కు హాజరు పరిచే టైంలో మాధవ్ వ్యవహరించిన తీరుతో… ఆయనకు అంత స్వేచ్ఛ ఎలా ఇచ్చారంటూ… ఏకంగా 11మంది పోలీసులు సస్పెండ్ అయ్యారు. అదంతా ఒక ఎత్తయితే…. వాస్తవంగా భారతి విషయంలో కిరణ్ చేసిన కామెంట్స్‌పై మహిళల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. గతంలో వైసీపీ వాళ్ళు కూడా అలాంటి కామెంట్స్ చేస్తే చేసి ఉండవచ్చుగానీ…. టీడీపీని ఆ కోణంలో ఊహించలేదని, ఇప్పుడు వాళ్ళు కూడా బరితెగించారా అన్న చర్చ సైతం జరిగిందట. దానికి తోడు సోషల్ మీడియాని మంచికే వాడదామంటూ తెలుగుదేశం పెద్దలు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్న కొందరు… కిరణ్ చేసిన దిగజారుడు కామెంట్స్‌తో అదే సోషల్ మీడియాలో ఇదేంటని ప్రశ్నించే ప్రాసెస్ మొదలైంది. సరిగ్గా ఇక్కడే గోరంట్ల మాధవ్ ఎంటరై మొత్తం వ్యవహారాన్ని డైవర్ట్ చేశారన్నది వైసీపీలో ఉన్న విస్తృతాభిప్రాయం అట. కిరణ్ కామెంట్స్ దెబ్బకు టీడీపీ అధిష్టానానికి కూడా ఏం చేయాలో అర్ధంగాక అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేసు బుక్ చేయిస్తే… అనవసరంగా మాధవ్ కెలికి పాడు చేశారన్న చర్చ వైసీపీలో జరుగుతోందట.
చేబ్రోలు కిరణ్‌పై మొదట్లో… టీడీపీలోనే వ్యతిరేకత వ్యక్తం అయినా, ఎందుకు అనవసరంగా పార్టీ పరువు తీస్తున్నాడని మాట్లాడుకున్నా, మధ్యలో మాధవ్ ఎంటరై దాడి పేరుతో ఓవరాక్షన్ చేశాక…. ఆ వ్యతిరేకత స్థానంలో సానుభూతి వచ్చిందట. వీ స్టాండ్ ఫర్ కిరణ్ అంటూ ఆయన కుటుంబం కోసం ఫండ్ రైజ్ చేసే వరకూ వెళ్లింది వ్యవహారం. కానీ… అదే సమయంలో బాధితుల స్థానంలో ఉన్న వైసీపీకి మాత్రం తిరిగి సమాధానాలు చెప్పుకోవాల్సిన స్థితిలోకి వెళ్ళిపోయింది. దీంతో ఆయన వైఖరి పార్టీకి లాభమా.. నష్టమా అన్న చర్చ మొదలైందట. సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడి భార్యను చేబ్రోలు కిరణ్ అన్ని మాటలు అన్నా… ఆ మాటలతో టీడీపీ కూడా డిఫెన్స్‌లో పడ్డా…. కేవలం మాధవ్ దాడి ఎపిసోడ్‌తో ఆ పార్టీ సేఫ్ జోన్‌లోకి వెళ్ళిందని, అన్నీ తెలిసి కూడా ఈ వ్యవహారంలో తాము ఏం మాట్లాడలేకపోతున్నామని తలపట్టుకుంటున్నారట వైసీపీ లీడర్స్. ఆయన గనుక ఈ వివాదంలోకి అనవసరంగా ఎంటరై… రచ్చ చేయకపోయి ఉంటే… పరిస్ధితి మరోలా ఉండేదన్న టాక్ ఉందట వైసీపీలో. అవతలి వాళ్ళు చేసిన తప్పులు ఎటో పోయాయి. ఇప్పుడు మేం మాధవ్‌ని కవర్ చేసుకుంటూ…మాట్లాడాల్సి వస్తోందన్నది ఫ్యాన్ లీడర్స్ బాధగా తెలుస్తోంది. ఈ విషయంలో పార్టీ కీలక నేతలు కూడా ఆయన మీద గరం గరం గానే ఉన్నట్లు సమాచారం. అడ్డసుడిగా మాట్లాడిన వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకోవడం మంచిదేనని, కానీ… ప్రతిదానికి ఓ పద్దతి పాడూ ఉంటుంది కదా…? తెలిసీ తెలియక చేసే రాజకీయాల వల్ల వాళ్ళతో పాటు పార్టీ కూడా అభాసుపాలు కావాల్సి వస్తుందని వైసీపీ ముఖ్యులు అంటున్నట్టు తెలుస్తోంది. టోటల్ ఎపిసోడ్‌లో గోరంట్ల వల్ల టాపిక్ మొత్తం డైవర్ట్ అయ్యిందని.. టీడీపీని కార్నర్ చేయాల్సింది పోయి తమను తాము డిఫెన్స్ చేసుకోవాల్సి వచ్చిందని ఫీలవుతున్నారట వైసీపీ లీడర్స్. మాధవ్ ఓవరాక్షన్ విషయంలో పార్టీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో చూడాలిమది.