Redmi A5 4G: రూ.10,000లోపే 6.88 అంగుళాల డిస్ప్లే, 5200mAh బ్యాటరీ ఫోన్!
- కేవలం రూ.10,000లోపే రెడ్‌మీ A5 4G స్మార్ట్‌ఫోన్
- 6.88 అంగుళాల డిస్ప్లే, 5200mAh బ్యాటరీ
- Unisoc T7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 32MP రియర్ కెమెరా
- ఏప్రిల్ 15న భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Redmi A5 4G: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షియోమి తన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను మరింత విస్తరించే దశలో, భారత మార్కెట్‌లో కొత్తగా రెడ్‌మీ A5 4G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టిన షియోమి.. ఏప్రిల్ 15న భారత మార్కెట్‌లో అధికారికంగా ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు ధృవీకరించింది. వినియోగదారులకు బడ్జెట్ ధరలలో మంచి ఫీచర్లను అందించే దిశగా షియోమి ఈ ఫోన్‌ను రూపొందించింది.
Read Also: Moto Book 60 Laptop: 14-అంగుళాల డిస్ప్లే, ఇంటెల్ కోర్ 7 ప్రాసెసర్తో విడుదలకు సిద్దమైన మోటో బుక్ 60
Also Read
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
షియోమి తెలిపిన సమాచారం ప్రకారం.. రెడ్‌మీ A5 ఫోన్ రూ.10,000లోపు ధర విభాగంలో అతి పెద్ద, స్మూత్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలిపింది. ఈ ఫోన్‌లో 6.88 అంగుళాల HD+ LCD స్క్రీన్ అందించబడనుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్ 5200mAh భారీ బ్యాటరీ సామర్థ్యంతో వస్తోంది. దీని ద్వారా యూజర్లు రోజంతా నిరంతరంగా ఫోన్‌ను వినియోగించవచ్చు. 15W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ద్వారా వేగంగా చార్జ్ చేసుకోవచ్చు. ప్రాసెసర్ పరంగా చూస్తే.. ఇది Unisoc T7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్ పై పనిచేస్తుంది. ఇది మల్టీటాస్కింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.
ఇక కెమెరా, ఇతర ఫీచర్లను చూసినట్లయితే.. ఈ ఫోన్ వెనుక భాగంలో 32MP రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఇది బడ్జెట్ సెగ్మెంట్‌లో భారీ కెమెరా మాడ్యూల్‌గా నిలుస్తుంది. సెక్యూరిటీ పరంగా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఇది అన్‌లాక్ చేయడాన్ని సులభతరం చేస్తుంది. ఫ్రంట్ కెమెరా కోసం 8MP కెమెరా ఉంటుంది. ఇది సెల్ఫీలతో పాటు వీడియో కాల్స్‌కు అనువుగా ఉంటుంది. రెడ్‌మీ A5 ఫోన్ ను జైసల్మేర్ గోల్డ్, పుదుచ్చేరి బ్లూ, జస్ట్ బ్లాక్ అనే మూడు ఆకర్షణీయమైన కలర్ వేరియంట్లలో అందించనున్నారు. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్, mi వెబ్ సైట్, ఆఫ్లైన్ స్టోర్స్ లో లభించనుంది.
తాజావార్తలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు