టాలీవుడ్ లో ఓ చిత్రమైన సంప్రదాయం ఉంది. ఓ సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ ఇస్తారు. కానీ అదే సినిమా ప్లాప్ అయితే దర్శకుడు వలన అనే అంటారు. ఇదేమి ఇప్పుడు కొత్తగా అనేది కాదు గత కొన్నేళ్లుగా ఈ తంతు ఇలానే జరుగుతుంది. స్టార్ హీరోల సినిమాల విషయంలో ఇది జరుగుతూనే ఉంటుంది. కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయిన భారీ ముల్టీస్టారర్ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అయితే కథ విషయంలో సదరు హీరో అనేక చేంజెస్ చేసాడని, దర్శకత్వం విషయంలో కూడా వేలు పెట్టాడని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటారు. కానీ అవేవి హీరో ఇమేజ్ ని డ్యామేజ్ చేయలేదు. కానీ దర్శకుడిపై భారీ ఎఫెక్ట్ పడింది. ఫ్యాన్స్ కూడా డైరెక్టర్ వలనే సినిమా పోయిందని దుమ్మెత్తి పోశారు. ఫలితంగా ఆ దర్శకుడితో సినిమా చేసేందుకు ముందు వెనక ఆలోచించే పరిస్థితి.
ఇక అదే హీరో గతంలో చేసిన ఓ సినిమా కథ పరంగా యావరేజ్ టాక్ ఉన్నా కూడా సీజన్ లో రావడంతో భారీ కలెక్షన్స్ రాబట్టింది. కానీ అప్పడు మాత్రం కేవలం తమ స్టార్ హీరో వలనే యావరేజ్ సినిమా వలనే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయిందని కామెంట్స్ వినిపించాయి. కానీ ఇక్కడ ఎవరైనా సరే గుర్తుంచుకోవాల్సింది ఒకటే ఒక సినిమా హిట్ అయినా ప్లాప్ అయిన అందులో హీరోనే కీలకం అనేది కాదనలేదని వాస్తవం. తెరపై అతడిని చూసే టికెట్స్ తెగుతాయి. కానీ ఒక సినిమా ఒప్పుకునే ముందు కథ, కథనాలు అన్ని విని కావలసిన మార్పులు చేర్పులు చేసి అన్ని ఒకే అనుకుంటేనే సెట్స్ పైకి వెళతారు. హీరో చెప్తే కథ విషయంలో మార్పులు చేయని డైరెక్టర్ అంటే బహుశా ఒక్క రాజమౌళికి మాత్రేమే చెల్లింది. మిగిలిన అందరు హీరో చెప్పినట్టు వినాల్సిందే. మరి అలాంటప్పుడు సినిమా ప్లాప్ అయితే దర్శకుడిపై నెట్టేయడం ఎంత వరకు సబబు.
ఇటీవల ఓ యంగ్ హీరో మాత్రం తన సినిమా ప్లాప్ కు తానే కారణమని వివరణ ఇస్తూ అఫీషియల్ గా ఓ నోట్ కూడా రిలీజ్ చేసాడు. మరో యంగ్ హీరో కథలో అన్ని పెట్టి గెలికేసి ఇప్పుడు సినిమా ప్లాప్ అయితే రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు. ఈ విధానం అందరిలోనూ రావాలి. హిట్ కొడితే క్రేజ్ ప్లాప్ వస్తే డైరెక్టర్ టేకింగ్ వలన వచ్చాయని మాటలు కట్టిపెట్టాలి. సినిమా అనేది అందరి సమిష్టి కృషి. 24 విభాగాలు కలిసికట్టుగా శ్రద్ద వహించి చేస్తేనే మంచి సినిమాలు వస్తాయి. అప్పుడే చిత్ర పరిశ్రమ పది కాలాలు కళకళలాడుతుంది.