ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) సంచలన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసి 111 పరుగులే చేసినా.. కోల్‌కతాను 95కే ఆలౌట్ చేసి 16 రన్స్ తేడాతో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. పంజాబ్ విజయంలో టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ కీలక పాత్ర పోషించాడు. చహల్ తన స్పిన్ మాయాజాలంతో కేవలం 28 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అద్భుతంగా బౌలింగ్ చేసిన యూజీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ విజయం అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తాను బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో బాల్ కాస్త టర్న్ అవడాన్ని గమనించా అని, యుజ్వేంద్ర చహల్‌ను శ్వాస మీద కాస్త నియంత్రణ సాధించు అని చెప్పానని శ్రేయస్ అయ్యర్ చెప్పాడు. ‘నేను బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో బంతి కాస్త టర్న్ అవుతోంది. మేము ఫీల్డింగ్ చేసేటప్పుడు నేను చహల్‌ను శ్వాస మీద నియంత్రణ సాధించు, కాస్త కూల్‌గా ఉండని చెప్పా. కచ్చితత్వంతో బంతు లేసి కేకేఆర్ బ్యాటర్లను అటాక్ చేయాలని సూచించా. చహల్ బంతిని తిప్పాడో మాకు విజయంపై విశ్వాసం కలిగింది. అదే సమయంలో నేను అటాకింగ్ ఫీల్డ్ సెట్ చేశా. బ్యాటర్లకు దగ్గరగా ఫీల్డర్లను మోహరించడంతో ఒత్తిడిలో తప్పులు చేసి వికెట్ ఇచ్చారు’ అని శ్రేయస్ తెలిపాడు.
‘నేను బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు బంతి విభిన్నంగా స్పందించింది. ఓ బాల్ ఎక్కువ బౌన్స్ రావడం, మరో బంతి నా బ్యాట్ కిందకు వచ్చింది. నేను మాత్రమే కాదు మిగతా బ్యాటర్లు కూడా స్వీప్ షాట్ ఆడటానికి ఇబ్బంది పడ్డారు. నిపిచ్ పరిస్థితులను బట్టి చూస్తే మేం చెప్పుకోదగ్గ స్కోరే చేశాం. పిచ్‌పై బంతి ఒక్కోసారి ఒక్కోలా వస్తోందని మా బౌలర్లకు వివరించా. వారు అద్భుత బంతులు వేశారు. రెండు ఓవర్లలో రెండు వికెట్లు పడగానే విజయంపై ఆశలు రేకెత్తాయి. చహల్ రాకతో మరింత విశ్వాసం కలిగింది. ప్రతి ఒక్కరు బాగా ఆడారు. ఈ విజయంతో మేం పొంగిపోం. ఈ గెలుపు మాలో మరింత బాధ్యతను పెంచింది. ఇదే స్ఫూర్తితో తర్వాతి మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తాం’ అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు.