Yamadonga : టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ మళ్లీ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే స్టార్ హీరోలకు చెందిన సినిమాలు రీ రిలీజ్ అవుతూ.. కోట్లు వసూలు చేస్తున్నాయి. ఈ రకంగా ఊడా నిర్మాణ సంస్థలకు ఆదాయం వస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇప్పుడు భారీ గుడ్ న్యూస్ వచ్చింది. ఎన్టీఆర్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోయిన యమదొంగ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే ఉంది. దానికంటే రెండు రోజుల ముందు మే 18న మూవీని రిలీజ్ చేస్తున్నారు. మే 19, 20వ తేదీల్లో సినిమా థియేటర్లలో ఆడబోతోంది. మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో, అమెరికాలోని కొన్ని సెలెక్టెడ్ థియేటర్లలో మూవీని రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్.
Read Also : THE Paradise : ది ప్యారడైజ్ రెగ్యులర్ షూట్ స్టార్ట్ అయ్యేది ఆ రోజే..
2007 ఆగస్టు 15న వచ్చిన ఈ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేశారు. అప్పట్లో ఈ మూవీ భారీ హిట్ కొట్టింది. ఇందులో మోహన్ బాబు యముడిపాత్రలో నటించారు. ఎన్టీఆర్ సన్నగా మారిన తర్వాత ఈ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ప్రియమణి హీరోయిన్ గా నటించింది. చిరంజీవి, ఊర్మిళ గంగరాజు నిర్మించిన ఈ సినిమాను.. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ రీ రిలీజ్ చేస్తోంది. ఈ సినిమాను 4కే ప్రింట్ లో చూపించబోతున్నారు. మొదట్లోనే భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా.. రీ రిలీజ్ లో కూడా రికార్డులు సృష్టిస్తుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.