Realme GT7: రియల్‌మీ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ GT7 ని చైనాలో ఏప్రిల్ 23న అధికారికంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. అద్భుతమైన పనితీరు, భారీ బ్యాటరీలతో “డబుల్ క్రౌన్” కోసం పోటీ పడతామని కంపెనీ తెలిపింది. ఇక రియల్‌మీ చైనా వైస్ ప్రెసిడెంట్ ప్రకారం.. GT7 ఫోన్‌లో 7000mAh కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న భారీ బ్యాటరీను అందించనున్నారు. అలాగే 100 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుందని తెలిపారు. ఇకపోతే ఈ ఫోన్ సంబంధించి లీకైన వివరాలు చూస్తే.. ఈ ఫోన్ 144Hz BOE స్క్రీన్, అతి పల్చని బెజెల్స్, ప్లాస్టిక్ మిడిల్ ఫ్రేమ్, అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, IP69 వాటర్‌ప్రూఫ్ రేటింగ్ వంటి ఫీచర్లతో రానుంది.
Read Also: Moto Book 60 Laptop: 14-అంగుళాల డిస్ప్లే, ఇంటెల్ కోర్ 7 ప్రాసెసర్తో విడుదలకు సిద్దమైన మోటో బుక్ 60
రియల్‌మీ ఇప్పటికే ప్రకటించినట్లుగా, రియల్‌మీ GT7 ఫోన్ MediaTek Dimensity 9400+ ప్రాసెసర్‌తో వచ్చే మొట్టమొదటి ఫోన్‌లలో ఒకటిగా ఉండబోతోంది. ఇది 3nm ప్రాసెసింగ్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించబడిన శక్తివంతమైన చిప్. దీని ద్వారా AI ఆధారిత స్మార్ట్ అనుభవం మరింత మెరుగ్గా ఉండనుందని రియల్‌మీ వైస్ ప్రెసిడెంట్ చేస్ షూ తెలిపారు. అలాగే, కొత్తగా అభివృద్ధి చేసిన GT పెర్ఫార్మన్స్ ఇంజిన్ 2.0 ఆధారంగా పెర్ఫార్మెన్స్ కిల్లర్ ఫీచర్‌ను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు ఎదుర్కొనే వినియోగ సందర్భాలను అద్భుతంగా నిర్వహించగలదని తెలిపారు.
ఈ స్మార్ట్‌ఫోన్ లో అద్భుతమైన కూలింగ్ సొల్యూషన్స్, ఇండస్ట్రీ-లీడింగ్ బ్యాటరీ ఎండ్యూరెన్స్, అల్ట్రా హై ఫ్రేమ్‌రేట్ స్టెబిలైజేషన్ వంటి ప్రత్యేకతలతో మార్కెట్‌ను ఆకర్షించబోతుందని కంపెనీ యాజమాన్యం తెలిపింది. రియల్‌మీ GT7 గురించి మరిన్ని వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్లు, ధర వంటి అంశాలు ఏప్రిల్ 23న అధికారికంగా విడుదల సందర్భంగా వెల్లడికానున్నాయి.