కూర చప్పగా ఉందనో, పెరుగు వేసుకున్నామనో ఉప్పు చల్లుకోవాలని చూస్తున్నారా? ఈ వార్త మీ కోసమే.. 

ఉప్పు ఎక్కువగా తినేవారికి మధుమేహం వచ్చే అవకాశం గణనీయంగా పెరుగుతున్నట్టు తేలింది.

 తీపి పదార్థాలు, తీపి పానీయాలు అతిగా తీసుకోవటం వల్ల బరువు పెరగటం.. మధుమేహం ముప్పు ముంచుకురావటం తెలిసిందే.

ఉప్పుతోనూ మధుమేహం ముప్పు పెరుగుతున్నట్టు స్టాక్‌హోమ్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌ అధ్యయనంలో తేలింది.  

రోజుకు 1.25 చెమ్చాలు అంతకన్నా ఎక్కువగా తీసుకునేవారికి మధుమేహం వచ్చే అవకాశం 72% ఎక్కువగా ఉంటున్నట్టు తేలింది.  

ఉప్పు మూలంగా ఇన్సులిన్‌ నిరోధకత తలెత్తుతున్నట్టు, ఇది మధుమేహానికి దారితీస్తున్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

 ఉప్పు అధికంగా తినటం వల్ల రక్తపోటు, బరువు కూడా పెరుగుతాయి. ఇవీ మధుమేహానికి దారితీసేవే. 

అధిక రక్తపోటు మధుమేహం రెండూ జంట శత్రువులు. సాధారణంగా చాలామందిలో ఇవి రెండూ కలిసే కనబడుతుంటాయి. 

అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ ప్రకారం.. రోజుకు 1,500 మిల్లీగ్రాముల సోడియం మించకుండా చూసుకోవటం ఉత్తమం.