Sarangapani Jathakam : ట్యాలెంటెండ్ హీరో ప్రియదర్శి, రూప కొడువాయుర్ జంటగా నటిస్తున్న మూవీ సారంగపాణి జాతకం. ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. తాజాగా మూవీ ట్రైలర్ ను రిఈజ్ చేశారు. ట్రైలర్ 2 నిముషాలకు పైగా ఉంది. మొదటి నుంచి ఎండ్ వరకు ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. అయితే ఈ ట్రైలర్ లో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిన సారంగపాణి.. తన నమ్మకాలతో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనే దాన్ని కామెడీ కోణంలో చూపిస్తారని అర్థం అవుతోంది.
Read Also : Disha Patani : దిశా పటానీ కత్తిలాంటి ఫోజులు..
నమ్మకాలు, ప్రేమించిన అమ్మాయితో పెళ్లి అనే రెండింటి నడుము ఒక సారంగపాణి ఏదో మర్డర్ ప్లాన్ చేసినట్టు ఇందులో చూపించారు. దాని కోసం ప్రియదర్శి, వెన్నెల కిషోర్ మధ్య వచ్చే సీన్లు చాలా ఫన్నీగా కనిపిస్తున్నాయి. అలాగే వైవాహర్ష డైలాగులు కూడా అదిరిపోయాయి. మొత్తంగా ప్రియదర్శి మరో కామెడీ ట్రాక్ సినిమాతో రాబోతున్నాడని అర్థం అవుతోంది. ఈ సినిమాను ఈ నెల 25న రిలీజ్ చేయబోతున్నారు. రీసెంట్ గానే కోర్టు మూవీతో హిట్ కొట్టిన ప్రియదర్శి.. ఈ సినిమాతో మరో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.