Raj Tarun : హీరో రాజ్ తరుణ్-లావణ్య ఇష్యూ మళ్లీ తెరమీదకు వచ్చింది. తాజాగా రాజ్ తరుణ్ పేరెంట్స్ ను లావణ్య ఇంట్లో నుంచి గెంటేయడం సంచలనం రేపుతోంది. కోకాపేటలోని రాజ్ తరుణ్ విల్లాలోకి ఆయన పేరెంట్స్ తాజాగా వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న లావణ్య.. వారిని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుంది. వారిని బయటకు పంపించేసింది. దీంతో రాజ్ పేరెంట్స్ అదే విల్లా ముందు కూర్చుని కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆ విల్లా తమదే అని వాళ్లు చెబుతున్నారు. ‘రాజ్ తరుణ్ కష్టపడి సినిమాలు చేసిన డబ్బులతో ఈ ఇల్లు కొన్నాడు. ఇందులో లావణ్యకు ఎలాంటి హక్కులు లేవు’ అంటూ వాళ్లు చెబుతున్నారు.
Read Also : Trivikram: త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి తమిళ్ స్టార్ హీరో షాక్?
ఆ ఇల్లుకు తాను కోటి రూపాయలకు ఇచ్చానంటూ లావణ్య తండ్రి చేసిన వ్యాఖ్యలను రాజ్ పేరెంట్స్ ఖండించారు. ‘ఈ విల్లా రాజ్ తరుణ్ సొంత డబ్బులతో కొన్నాడు. లావణ్య తండ్రి ఒక్క రూపాయ కూడా ఇవ్వలేదు. అతని దగ్గరే డబ్బులు లేవు. అతనెలా ఇస్తాడు. మేం కూడా డబ్బులు ఇవ్వలేదు. రాజ్-లావణ్య మూడేళ్ల పాటు రిలేషన్ లో ఉన్నారు. కానీ ఆ తర్వాత విడిపోయారు. వారికి పెళ్లి జరగలేదు. ఆ గొడవలు అయినప్పుడే మాకు ఆరోగ్య సమస్యలు వచ్చి ట్రీట్ మెంట్ కోసం బయటకు వెళ్లాం. ఇప్పుడు ఇంటికి వస్తే ఇలా మమ్మల్ని లావణ్య గెంటేసి ఇంట్లో కూర్చుంది. మేం ఇక్కడకు వస్తున్నట్టు రాజ్ తరుణ్ కు తెలియదు. ఈ ఇల్లు మాదే. లావణ్యను ఖాళీ చేయించండి. దయచేసి మాకు న్యాయం చేయండి’ అంటూ చెప్పుకొస్తున్నారు రాజ్ పేరెంట్స్.
ఇక ఇదే విల్లాలో కొన్ని రోజులుగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ పావని విల్లాస్ అసోసియేషన్ రాజ్ తరుణ్ కు లేఖ రాసింది. ఇక ఈ వివాదంపై ఇప్పటి వరకు రాజ్ తరుణ్ స్పందించలేదు. ప్రస్తుతం అక్కడకు శేఖర్ భాషా వెళ్లారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్ పేరెంట్స్ కు న్యాయం చేసేదాకా తాను అక్కడే ఉంటానని చెబుతున్నాడు. మరోవైపు లావణ్య మాత్రం తనపైనే దాడి చేయడానికి వచ్చారు అంటూ చెబుతోంది. రాజ్ పేరెంట్స్ 15 మందిని తీసుకుని ఇంటికి వచ్చారని.. వారంతా దాడి చేయడానికి ప్రయత్నించారంటూ ఆరోపిస్తోంది.