గత మూడు రోజులుగా బంగారం ధరలు భారీ స్థాయిలో పెరిగాయి. ఈరోజన్నా తగ్గుతుందనుకుంటే.. రేట్స్ మళ్లీ షాకిచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.270, 22 క్యారెట్లపై రూ.250 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శనివారం (ఏప్రిల్ 12) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,700గా.. 24 క్యారెట్ల ధర రూ.95,670గా నమోదయింది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఈ నాలుగు రోజుల్లోనే పుత్తడి ధరలు దాదాపుగా 6 వేలు పెరిగాయి. గతేడాదే ఆల్ టైమ్ హైకి చేరిన బంగారం ధర.. ఇప్పుడు లకారానికి నాలుగు అడుగుల దూరంలో మాత్రమే ఉంది. వచ్చే వారంలో కూడా పసిడి ధరలు ఇలానే పరుగులు పెడితే.. లక్ష రూపాయలను చేరుకుంటుంది. గోల్డ్ రేట్లు తగ్గొచ్చని చెప్పిన అనలిస్టుల అంచనాలు తల్లకిందులు అయ్యాయి.
Also Read: MS Dhoni: అది మాకు చేతకాదు.. సీఎస్‌కే ఓటమిపై స్పందించిన ధోనీ!
మరోవైపు వెండి ధర కూడా దూసుకుపోతోంది. వరుసగా మూడోరోజు ధర పెరిగింది. కిలో వెండిపై ఈరోజు ఏకంగా రూ.2,900 పెరిగి.. బులియన్ మార్కెట్‌లో రూ.1,00,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే కిలో వెండి ఒక లక్ష 10 వేలుగా ఉంది. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం 10 గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరలు ఇవి.