సాయి అభ్యంకర్, ఈ పేరు ఈ మధ్యకాలంలో గట్టిగా వినిపిస్తోంది. మనోడి వయసు 20 ఏళ్లు మాత్రమే. ఇప్పటివరకు సంగీత దర్శకుడిగా ఒక్క సినిమా కూడా చేయలేదు. కొన్ని ప్రైవేట్ సాంగ్స్ చేశాడు, అవన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పటివరకు రాక్‌స్టార్ అనిరుధ్ దగ్గర అడిషనల్ ప్రోగ్రామర్‌గా పని చేస్తూ, దేవర, కూలీ లాంటి సినిమాలకు కూడా వర్క్ చేశాడు. ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాకి సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. ఈ రోజు వచ్చిన ప్రకటనలో పేరు రాలేదు కానీ, మనోడు దాదాపుగా ఖరారు అయినట్లే. అయితే అసలు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌తో మనోడు వచ్చి ఇలాంటి అవకాశాలు దక్కించుకుంటున్నాడు అనే అనుమానాలు చాలామందికి ఉన్నాయి.
Renu Desai : రాజకీయాల్లోకి రావాలని ఉంది.. రేణూ దేశాయ్ సంచలనం
అయితే మనోడి బ్యాక్‌గ్రౌండ్ కూడా సంగీత బ్యాక్‌గ్రౌండే. టిప్పు, హరిణి అనే ప్లే బ్యాక్ సింగర్స్ మీకు గుర్తుండే ఉంటారు. 2000 సంవత్సరం నుంచి కొన్నాళ్లపాటు వారిద్దరూ తెలుగు సంగీత ప్రపంచాన్ని ఏలారు. వారిద్దరూ పాడిన పాటలు ఇప్పటికీ చాలామంది వింటూనే ఉంటారు. వారి కుమారుడే ఈ సాయి అభ్యంకర్. సంగీతం మీద పిచ్చితో అనిరుధ్‌తో పనిచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మనోడు చేసిన మొదటి సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా అవకాశం దక్కించుకున్నాడు.
నిజానికి ఒకప్పుడు సంగీత ప్రపంచాన్ని ఏలిన ఏ.ఆర్. రెహమాన్, హారిస్ జయరాజ్, యువన్ శంకర్ రాజా వీరందరూ కూడా తమ మొదటి బిగ్ బడ్జెట్ ఫిల్మ్ చేసే నాటికి 27 ఏళ్ల వారు. అలాగే అనిరుధ్ కూడా 23 ఏళ్లకి ఒక బడా ప్రాజెక్ట్ సంపాదించాడు. కానీ 20 ఏళ్ల సాయి అభ్యంకర్ ఇండియన్ సినీ హిస్టరీలోనే ఒక ఎక్స్‌పెన్సివ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ దక్కించుకోవడం మామూలు విషయం కాదని చర్చ జరుగుతోంది.