దసరాతో టాలీవుడ్‌కు దొరికిన విలన్ షైన్ టామ్ చాకో. మలయాళ ఇండస్ట్రీ నుండి వచ్చిన షైన్.. తన యాక్టింగ్‌తో తమిళ తంబీలను, టీఎఫ్ఐ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. తెలుగులో రంగబలి, దేవర, ఢాకూ మహారాజ్, రీసెంట్లీ రాబిన్ హుడ్‌తో పలకరించాడు. తెరపై మస్త్ షేడ్స్ చూపించే ఈ మాలీవుడ్ యాక్టర్.. సినిమాకు ఏ మాత్రం ప్లస్ కానీ.. తన కెరీర్‌కు యూజ్ కానీ క్యారెక్టర్స్ ఎంచుకుని తనకున్న రెప్యుటేషన్ తగ్గించుకుంటున్నాడు. అందుకు ఎగ్జాంపుల్ రీసెంట్లీ వచ్చి జీ. బీ. యు, భజూక, అలప్పుజ జింఖానా చిత్రాలు. ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చాయి గుడ్ బ్యాడ్ అగ్లీ, అలప్పుజ జింఖానా, భజూక చిత్రాలు. ఈ మూడింటిల్లోనూ నటించాడు షైన్ టామ్ చాకో. యాక్ట్ చేశాడు అనడం కంటే.. అలా మెరుపు తీగలా వచ్చి.. ఇలా వెళ్లిపోయాడు. జస్ట్ వన్ సీన్‌తో సరిపెట్టేసుకున్నాడు.
THE Paradise : ది ప్యారడైజ్ రెగ్యులర్ షూట్ స్టార్ట్ అయ్యేది ఆ రోజే..
గుడ్ బ్యాడ్ అగ్లీలో అజిత్ బ్యాక్ డ్రాప్ స్టోరీకి ఎలివేషన్ ఇచ్చే విలన్ గ్యాంగ్‌లో ఓ స్మాల్ క్యారెక్టర్ చేశాడు. అలాగే భజూకలో కూడా సింగిల్ రన్ చేసి వెళ్లిపోయే బ్యాట్స్ మన్‌లా కనిపించాడు. ఈ రెండే కాదు.. ప్రేమలు ఫేం నస్లేన్ హీరోగా వచ్చిన అలప్పుజ జింఖానాలో కూడా జస్ట్ వన్ సీన్ రోల్. హీరో అండ్ టీంకి కోచ్‌గా వ్యవహరించాడు. ఈ మూడు చిత్రాల్లోనూ అతడి క్యారెక్టర్ ఉన్నట్లు కూడా తెలియదు. పోనీ ఉన్నది కాసేపే అయిన మెరుపులు మెరిపించాడా అంటే అదీ కాదు.. కానీ కథకు ప్లస్ అయ్యాడా నో యూజ్. షైన్‌ను సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నారు ఫిల్మ్ మేకర్స్. సరే దర్శక నిర్మాతలు ఆఫర్ చేస్తే.. షైన్ ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాడో అర్థం కాని సిచ్యుయేషన్. గతంలో విజయ్ బీస్ట్ సినిమా విషయంలో తన క్యారెక్టర్ డమ్మీ చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసి.. తర్వాత నాలుక కరుచుకుని సారీ చెప్పిన టామ్ చాకో.. మరి ఇప్పుడు చేస్తున్నదేమిటీ? ఒకసారి తన రోల్స్ విషయంలో సీరియస్‌గా థింక్ చేస్తే బాగుంటుందేమో షైన్..?