ఫ్యూఛర్ సిటీ... దేశంలోని నగరాలతోకాదు.. ప్రపంచ నగరాలతో పోటీ పడేవిధంగా తీర్చిదిద్దేలనే లక్ష్యంతో దార్శనిక ప్రణాళిక రెడీ అయింది. టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కిస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిశ్రమలు, సాంకేతిక, అంతరిక్ష, వైమానిక, రక్షణ, పర్యాటక, సెమీకండక్లర్ల పరిశ్రమలను స్థాపించ బోతున్నారు. ఇందుకు సంబంధించి పారిశ్రామిక దిగ్గజాలకు ప్రోత్సాహాలను అందించి.. పెట్టుబడులు సాధించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని, అందుకోసం అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని వారు ఎదురుచూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బుధవారం సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్, అక్కడ నిర్వహించిన ఆటో డ్రైవర్లకు ఆత్మీయ భరోసా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్… దేవుళ్ల మీద ఒట్టేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలంటే రూ.50 వేల…
CMRF Record : తెలంగాణలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రికార్డు సృష్టించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత రెండేళ్లలో పేద, మధ్యతరగతి ప్రజలకు ఎప్పుడూ లేని స్థాయిలో వైద్య సహాయం అందింది. 2023 డిసెంబర్ 7 నుంచి 2025 డిసెంబర్ 6 వరకు మొత్తం 3,76,373 మంది లబ్ధిదారులకు రూ.1,685.79 కోట్ల సహాయం అందజేశారు. గతంలో 2014 నుంచి 2024 వరకు సంవత్సరానికి సగటున రూ.450 కోట్లు మాత్రమే…
Harish Rao : తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సమ్మిట్ను ఆయన ‘గ్లోబల్ సమ్మిట్ కాదు, గోబెల్స్ సమ్మిట్’ అంటూ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా పూర్తిగా విఫలమయ్యారని హరీష్ రావు ఆరోపించారు. “రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు.? ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం,” అని ఆయన అన్నారు. గ్లోబల్ సమ్మిట్ ముసుగులో రియల్…
CM Revanth Reddy Emotional Speech at Osmania University: ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి.. ఆర్ట్స్ కాలేజీ ముందు నిలబడి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలి అని అనుకున్నట్లు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చినది ఉస్మానియా యూనివర్సిటీ అని కొనియాడారు. యూనివర్సిటీకి వచ్చే ముందుకు సీఎం మీరు చాలా ధైర్యం చేస్తున్నారు అన్నారు.. సీఎంని అడ్డుకునే చరిత్ర ఉంది.. మీరెందుకు ధైర్యం చేస్తున్నారు అని చెప్పారన్నారు. నాది దైర్యం కాదు... నాది అభిమానం…
తెలంగాణ వచ్చిన తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్రం ఇచ్చామని చెప్పుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పాలనపై అసంతృప్తిగా ఉన్న వర్గాలను ఆకట్టుకుని ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. ప్రభుత్వం వచ్చిన తొలి రోజు నుంచి హామీల అమలు దిశగా ముందడుగు వేసింది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాలన మొదలుపెట్టి.. ఆరోగ్యశ్రీ పరిమితి కూడా పెంచి హామీల విషయంలో వెనకడుగు లేదని చాటుకుంది.
CM Revanth Reddy: హైదరాబాద్లో ఉన్న అగ్రస్థాయి స్టార్ట్-అప్స్ లో గూగుల్ ఒకటని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. టీ హబ్ లో గూగుల్ స్టార్టప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మీరు యువకులు, శక్తివంతులు.. సాధారణంగా మీరు మీ కలలను సాకారం చేసుకోవాలనుకుంటారు. ఈ సందర్భంగా మీకు స్పూర్తిని కలిగించే ఒక విషయం చెబుతా... ఉన్నత ఆశయాలతో 1998లో ఇద్దరు స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ మిత్రులు కలిసి కాలిఫోర్నియాలో ఒక గ్యారేజీలో ఓ స్టార్ట్-అప్ ను ప్రారంభించారు.
CM Revanth Reddy to Visit Osmania University: ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ వెళ్లనున్నారు. సీఎం హోదాలో రెండు సారి ఓయూకి వెళ్లనున్నారు. ఈ ఏడాది ఆగస్టులో తొలిసారి ఓయూకు వెళ్లారు. డిసెంబర్ లో మళ్ళీ వస్తానని అప్పట్లో మాటిచ్చారు. కాగా.. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ది కోసం రూ. 1000 కోట్లు విడుదల చేశారు. సిబ్బంది నియామకం.. నూతన భవనాల నిర్మాణం, ఓయూలో సమస్యల పరిష్కారంపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు.
Anand Mahindra : భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత వైభవంగా నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ విజయవంతంగా ముగిసింది. ఈ అంతర్జాతీయ స్థాయి సమ్మిట్లో ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా పాల్గొని సీఎం రేవంత్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అభివృద్ధి దిశ, విజన్ డాక్యుమెంట్ ఆయనను బాగా ఆకట్టుకుందని వెల్లడించారు. సమ్మిట్ వేదికపై మాట్లాడిన ఆనంద్ మహీంద్రా… టెక్నాలజీ ఎంత వేగంగా ఎదిగినా, డిజిటలైజేషన్,…
Maha Lakshmi Scheme: మహా లక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహిళలకు ఆర్టీసీ ఉద్యోగులకు, సిబ్బందికి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 9,2023 నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం తెలంగాణ అక్కా చెల్లెలకు మహా లక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించింది.. నేటికి…