TDP vs YSRCP: టెంపుల సిటీలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది.. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్వీ గోశాలలో వందలాది గోవులు మృతిచెందాయంటూ టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది.. అదేస్థాయిలో అధికారపక్షం కౌంటర్ ఎటాక్‌కు దిగింది.. టీటీడీ కూడా ఇది తప్పుడు ప్రచారం.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వీడియోలు అసలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కావు అంటూ క్లారిటీ ఇచ్చింది.. అయితే, ఎస్వీ గోశాల వివాదం టెంపుల్ సిటీలో పొలిటికల్ హీట్ పెంచింది… అసత్య ప్రచారం చేసిన వైఎస్ జగన్ రేపు ఉదయం ఎస్వీ గోశాలకు రావాలి.. వచ్చి అక్కడి పరిస్థితి నేరుగా చూడవచ్చు అంటూ తెలుగుదేశం పార్టీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సవాల్ విసిరింది… అయితే టీడీపీ సవాల్ కు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు.. రేపు ఉదయం 10 గంటలకు గోశాలలో కలుద్దాం అంటూ ప్రకటన విడుదల చేశారు..
Read Also: Akhilesh Yadav: కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఈడీ ఏర్పాటు.. ఇప్పుడు దాని వలలోనే హస్తం పార్టీ!
అయితే, ప్రభుత్వం, టీటీడీ నిర్లక్ష్యం కారణంగా 100 గోవులు చనిపోయాయని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తే.. అవినీతి అక్రమాలు అన్నీ కూడా మీ హయాంలోనే జరిగిందంటూ విజిలెన్స్ రిపోర్ట్ బయట పెట్టిందని టీటీడీ చెబుతోంది.. 100 గోవులు చనిపోయాయని వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేశారని అవన్నీ ఫేక్ ఫొటోలతో టీటీడీ ప్రతిష్ట దెబ్బకు తీసే విధంగా వైసీపీ కుట్రలు పన్నుతోందంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇప్పటికే భూమన మీద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి.. దీంతో సవాళ్లు.. ప్రతి సవాళ్లు నేపథ్యంలో రేపు గోశాల వేదికగా ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది..
Read Also: Gaddar Cine Awards: ఉమ్మడి రాష్ట్రంలో కూడా చలన చిత్ర అవార్డ్స్ కు ఇంత స్పందన రాలేదు!
కాగా, టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి కౌంట్‌డౌన్ ప్రారంభం ⏱️.. వైఎస్ జగన్‌కి, భూమన కరుణాకర్‌రెడ్డికి ఇదే మా ఛాలెంజ్. ఏప్రిల్ 17వ తేదీన తిరుమలకు రండి. గోశాలలో గోమాతలు ఎలా ఉన్నాయో మీ కళ్లారా చూడండి.. అంటూ సవాల్ విసిరింది టీడీపీ.. ఇక, దీనిపై స్పందించిన భూమన కరుణాకర్‌రెడ్డి.. టీటీడీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు చాలా ఆవేదనతోనూ, ఆవేశంతోనూ మాకు ఛాలెంజ్ విసురుతూ రేపు గోవుల పరిస్థితి చూద్దాం అని అన్నారు. ఆ ఛాలెంజ్ ను నేను స్వీకరిస్తూ ఖచ్చితంగా వస్తున్నాను. కాకపోతే శ్రీనివాస రావు, తెలుగుదేశం పార్టీ అజ్ఞానంతో తిరుమలకు రండి అని చెప్తున్నారు. తిరుమలలో రాజకీయాలు చేయటం కరెక్ట్ కాదన్న సంగతి మీకు తెలిసి కూడా ఈ రకమైనటువంటి మాట వాడడం చాలా తప్పు. అందులోను ముఖ్యమైన విషయం గోవులు చనిపోయినటువంటిది తిరుపతి గోశాలలో, తిరుమలలో కాదు అన్నటువంటి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి మీరు ఈ రకంగా ఒక ట్వీట్ చేయటం అన్నది, దాన్ని అజ్ఞానమని అనాలో, అద్భుతమైనటువంటి మీ మహా తెలివి అనుకోవాలో దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థం అవుతుందంటూ దుయ్యబట్టారు.. పల్లా శ్రీనివాస్.. నేను మీ ఛాలెంజ్ ను స్వీకరించి అక్కడికి వస్తున్నా అని స్పష్టం చేశారు..