‘‘వెంకీ పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’’ అంటుంటారు. ఈ సామెత ఎందుకు పుట్టుకొచ్చిందో తెలియదు గానీ.. ఈ సామెత మాత్రం అచ్చు గుద్దినట్లుగా ఆ సంఘటనకు సరిపోతుంది. అసలేమైంది?, ఈ ప్రస్తావన ఇప్పుడెందుకు వచ్చిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఆమె ఓ వివాహిత. అంతేకాదు ఓ సీనియర్ కానిస్టేబుల్ అజయ్ కుందు భార్య. పేరు జ్యోతి. చండీగఢ్ ప్రాంతం. పంజాబ్, హర్యానా రాజధాని. మార్చి 20న వదిన పూజతో కలిసి జ్యోతి దేవాలయానికి వెళ్లింది. సాయంత్రం 4:30 గంటలకు తిరిగి వస్తుండగా.. ఏం బుద్ధి పుట్టిందో.. ఏమో తెలియదు గానీ.. ఉన్నట్టుండి సెక్టార్-20 గురుద్వారా చౌక్ దగ్గర జీబ్రా క్రాసింగ్‌పై రీల్స్ చేయడం మొదలు పెట్టింది. సిగ్నల్ దగ్గర ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. అయినా కూడా జ్యోతి డ్యాన్స్ చేస్తూనే ఉంది. ఒక ఫేమస్ పాట ప్లే అవుతుండగా ఆమె వదిన మొబైల్‌లో రికార్డ్ చేసింది. అక్కడితో ఆగకుండా ఇంటికెళ్లి అజయ్ కుందు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేసింది. ఇది వైరల్‌గా మారింది.
ఈ విషయాన్ని హెడ్ కానిస్టేబుల్ జస్బీర్ చండీగఢ్‌లోని సెక్టార్ 34 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై సీరియస్ అయిన చండీగఢ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏఎస్‌ఐ బల్జిత్ సింగ్ నేతృత్వంలోని బృందం సెక్టార్ 20లోని గురుద్వారా చౌక్, సెక్టార్ 17లోని పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. రీల్స్ కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లుగా గుర్తించారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం, ప్రజా భద్రతకు ప్రమాదం కలిగించడం వంటి నేరాల కింద ఇద్దరు మహిళలపై బీఎన్ఎస్ సెక్షన్లు 125, 292 మరియు 3(5) కింద కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా కానిస్టేబుల్ అజయ్ కుందును సస్పెండ్ చేశారు. జ్యోతి, పూజలకు వెంటనే బెయిల్ లభించింది.
అయితే అజయ్ కుందు సస్పెన్షన్‌పై మిశ్రమ స్పందనలు వెల్లువడ్డాయి. మహిళలు చేసిన తప్పుకి భర్తను బలి చేయడమేంటి? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చాలా మంది ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఇంకొకరు వినోదం కోసం అలా చేస్తే తప్పేంటి? అని అడిగారు. మరికొందరు నడిరోడ్డుపై ఇవేం పనులు అంటూ నిలదీశారు. ఇలా రకరకాలుగా నెటిజన్లు స్పందించారు. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.
चंडीगढ़: पुलिसकर्मी की पत्नी ने ज़ेबरा क्रॉसिंग पर बनाई रील, ट्रैफिक नियमों की उड़ाई धज्जियां; रोड पर लगा जाम
महिला के खिलाफ पुलिस ने FIR दर्ज की, हालांकि थाने में ही बेल दे दी गई. मामला सेक्टर-20 में गुरुद्वारा चौक के पास का है.#Chandigarh pic.twitter.com/l2j4fTYFGv
— Ishani K (@IshaniKrishnaa) March 27, 2025