త్రివిక్రమ్‌కు ఒక తమిళ స్టార్ హీరో షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనతో సినిమా చేయాలన్న ఆలోచనను కూడా పక్కన పెట్టినట్లు సమాచారం. నిజానికి, ‘గుంటూరు కారం’ సినిమా తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్‌తో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ, అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేయాలని నిర్ణయించుకోవడంతో త్రివిక్రమ్‌తో చేయాల్సిన సినిమా కాస్త వెనక్కి వెళ్లింది. దీంతో సమయం వృథా చేయకుండా, త్రివిక్రమ్ ఇతర ఆప్షన్స్ ఉన్నాయేమో వెతుకుతున్నారు.
Trivikram : 300కోట్ల హీరోతో త్రివిక్రమ్ సినిమా.. ఇంకా చాలా ఉందట!
అందులో భాగంగానే ఇప్పటికే వెంకటేష్‌కు ఒక సినిమా కథ చెప్పారు. వెంకటేష్ ఓకే అన్నప్పటికీ, ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుందా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో, త్రివిక్రమ్ ఒక తమిళ స్టార్ హీరోకు కూడా కథ చెప్పారు. ఆయన ఎవరో కాదు, శివకార్తికేయన్. ‘అమరన్’ లాంటి సక్సెస్ తర్వాత శివకార్తికేయన్ మార్కెట్ తెలుగు, తమిళంలో ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఆయన రెమ్యూనరేషన్ కూడా అంతే స్థాయిలో పెంచినట్లు తెలుస్తోంది. శివకార్తికేయన్ తెలుగు సినిమా చేయడానికి ఎలాంటి ఇబ్బందీ లేదని చెప్పాడు, కానీ 70 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అడిగినట్లు సమాచారం. 70 కోట్ల రూపాయలు శివకార్తికేయన్‌కు ఇస్తే, సినిమా వర్కౌట్ కాకపోవచ్చని త్రివిక్రమ్ భావించారు. దీంతో ఇప్పట్లో ఆ సినిమాను వద్దని చెప్పి స్కిప్ చేసినట్లు తెలుస్తోంది.