అక్కినేని అభిమానులకు శుభవార్త. తండేల్ సినిమా హిట్ అందుకున్న నాగ చైతన్య తన తదుపరి చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు, అది కూడా ఒక అసాధారణ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్‌తో! ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు. ఈ కాంబినేషన్ గురించి ఇన్సైడ్ టాక్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నాగ చైతన్య ఈ సినిమా కోసం తన శారీరక రూపాన్ని పూర్తిగా మార్చుకుంటున్నాడని సమాచారం. “నెవర్ బిఫోర్” అనేలా అతని ఫిజికల్ అప్పియరెన్స్ ఉండబోతుందని ఇన్సైడ్ సోర్సెస్ తెలియజేస్తున్నాయి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ కేవలం లుక్‌ను మాత్రమే కాకుండా, పాత్రకు తగ్గట్టుగా శారీరక శ్రమ కూడా ఉంటుందని అంటున్నారు. గతంలో ‘లవ్ స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి చిత్రాల్లో సాఫ్ట్ లుక్‌తో అలరించిన చైతన్య, ఈసారి ఒక డిఫరెంట్ యాంగిల్‌లో కనిపించనున్నాడు. ఈ మార్పు అభిమానులకు ఆశ్చర్యం కలిగించడమే కాక, సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది.
Bollywood : రణబీర్- దీపికా.. వర్కౌట్ అవుతుందా..?
‘విరూపాక్ష’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన దర్శకుడు కార్తీక్ దండు, ఈసారి నాగ చైతన్యతో జతకట్టాడు. ‘విరూపాక్ష’ ఒక మిథికల్ థ్రిల్లర్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాక, బాక్సాఫీస్ వద్ద కూడా సత్తా చాటింది. ఈ నేపథ్యంలో, చైతన్యతో రూపొందనున్న ఈ కొత్త చిత్రం కూడా అదే జోనర్‌లో ఉంటుందని తెలుస్తోంది. సినిమా టైటిల్‌గా ‘వృషకర్మ’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం వచ్చింది, అయితే ఇది ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. కార్తీక్ దండు మార్క్ స్క్రీన్‌ప్లే, ఉత్కంఠభరితమైన కథనంతో ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైందని, ఇటీవల నాలుగు రోజుల పాటు ఒక షెడ్యూల్ పూర్తయిందని టాక్. త్వరలోనే మరో షెడ్యూల్ మొదలు కానుంది. అంతేకాక ఈ సినిమా స్క్రిప్ట్ అక్కినేని అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా సిద్ధమైందని ఇన్సైడ్ టాక్. చైతన్య గత చిత్రాలైన ‘కస్టడీ’, ‘ధూత’ వంటివి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన నేపథ్యంలో, ఈ సినిమా అతనికి బిగ్ కమ్‌బ్యాక్ ఇస్తుందని అంచనాలు ఉన్నాయి. కార్తీక్ దండు రూపొందించిన ఈ కథలో చైతన్య పాత్ర ఒక బలమైన ఎమోషనల్ కనెక్షన్‌తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.