Gold Rates: బంగారం, వెండి ధరలు మరోమారు భారీ షాకిచ్చాయి. గత రెండు రోజులు స్వల్పంగా తగ్గి ఉరటనిచ్చిన ధరలు నేడు ఒక్కసారిగా పెరిగి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిణామం చూస్తే బంగారం తులం ధర లక్షకి చేరుకోవడం ఎక్కువ రోజులు పట్టేలా లేదు. ఇకపోతే, నేడు 10 గ్రాములు 24 క్యారెట్ల ధర నిన్న రూ.95,180 ఉండగా నేడు రూ.990 ఎగబాకి రూ. 96,170 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.95 పెరిగి 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 87,200 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే 10 గ్రాములు 18 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.72,130 ఉండగా, నేడు రూ.780 పెరిగి రూ.71,350 వద్ద అల్ టైం హై గా ట్రేడ్ అవుతుంది.
ఇక మరోవైపు వెండి ధరలు కూడా బంగారాన్ని ఫాలో అవుతున్నాయి. నిన్నటి ధర రూ.99,800 గా ఉండగా నేడు స్వల్పంగా కేజీ వెండిపై రూ.200 పెరిగి రూ.1,00,000కు చేరుకుంది. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.1,00,000, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లలో కిలో వెండి ధర రూ.1,10,000 గా ట్రేడ్ అవుతుంది.