మునక్కాయలు మన  ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కానీ కొందరు మాత్రం వీటికి దూరంగా ఉండాలి.  

 గుండె జబ్బులతో బాధపడేవారు మునక్కాయలను పొరపాటున కూడా తినకూడదు. 

వీటిలో ఉండే ఆల్కలాయిడ్ గుండె కొట్టుకునే వేగాన్ని తగ్గిస్తుంది. వాళ్లకు గుండె జబ్బులొచ్చే ప్రమాదం పెరుగుతుంది. 

 తక్కువ రక్తపోటు ఉన్నవారు మాత్రం వీటిని పొరపాటున కూడా తినకూడదు. లేదా చాలా వరకు తగ్గించాలి. 

ఎందుకంటే మునక్కాయలను ఎక్కువగా తినడం వల్ల బీపీ చాలా తగ్గుతుంది. 

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. గర్భంతో ఉన్నప్పుడు మునక్కాయలను తినకపోవడమే మంచిది. 

ఇది వీళ్లకు మంచి కంటే చెడే ఎక్కువ చేస్తుంది. ఎందుకంటే మునక్కాయలు గర్భస్రావానికి దారితీస్తాయి. 

హైపర్ సెన్సివిటీ సమస్యతో బాధపడుతున్న వారు కూడా మనుక్కాయలను తినకపోవమే మంచిది. 

 మునక్కాయలు థైరాయిడ్ సమస్యలను మరింత పెంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

సరిగ్గా ఉడకని మునక్కాయలను తినడం వల్ల గ్యాస్, డయేరియా వంటి కడుపునకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.