Khushi Kapoor : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీకపూర్ చెల్లెలు ఖుషి కపూర్ గురించి తెలిసిందే. ఆమె కూడా తల్లి, అక్క బాటలో నడవాలని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మూడు సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఆమెపై ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఆమె తన కో స్టార్ వేదాంగ్ తో లవ్ లో ఉందంటూ ఎప్పటి నుంచో రూమర్లు వినిపిస్తున్నాయి. కానీ ఆమె మాత్రం వాటిని ఎప్పుడూ కన్ఫర్మ్ చేయలేదు. అలా అని కొట్టిపారేయట్లేదు. దీంతో ఈ తరహా రూమర్లు మరింత పెరుగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో ఆమె తాజాగా ఓ ఫొటో షేర్ చేసింది. ఇది చూసిన వారంతా ప్రియుడితో డేటింగ్ ను కన్ఫర్మ్ చేసేస్తున్నారు.
Read Also : KGF Star Yash: కేజీఎఫ్ రాకీ భాయ్ వాడే లగ్జరీ కారు ఎన్ని కోట్లో తెలుసా?
తాజాగా ఆమె చేసిన పోస్టులో వీ.. లవ్.. కే.. అని ఉంది. వీ అంటే వేదాంగ్ అని, కే ఖుషి కపూర్ అంటూ నెటిజన్లు కన్ఫర్మ్ చేసేస్తున్నారు. వారి లవ్ మ్యాటర్ ను ఖుషి కపూర్ ఇలా బయటపెట్టేసిందని చెబుతున్నారు. ఈ పోస్టు క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది. 2023లో ఖుషి కపూర్ ది ఆర్చిస్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలోనే ఆమె కోస్టార్ గా వేదాంగ్ నటించాడు. అప్పటి నుంచే వీరిద్దరి నడుమ ప్రేమ చిగురించింది అనే వార్తలు బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు వీరిద్దరూ బయట తిరుగుతున్న ప్రైవేట్ ఫొటోలు కూడా లీక్ అవుతున్నాయి. కానీ వాటిపై ఖుసి కపూర్ మాత్ర స్పందించట్లేదు. అక్క జాన్వీకపూర్ స్టార్ హీరోయిన్ దారిలో పయనిస్తోంది. దివంగత హీరోయిన్ శ్రీదేవి కూతుర్లైన వీరిద్దరూ సినిమాల్లో బాగానే రాణిస్తున్నారు.