వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు.. ముఖ్యంగా దగ్గు, జలుబు, జ్వరాలు చుట్టుముడతాయి. దగ్గు అయితే మరీ ఇబ్బంది పెడుతుంది.

అందునా పొడి దగ్గు వచ్చిందంటే.. ఎన్ని మందులు వాడినా త్వరగా పోదు. అయితే.. ఈ వంటింటి చిట్కాలు మాత్రం బాగా పని చేస్తాయి.

తులసి ఆకులను వేడి నీటిలో వేసి.. బాగా మరిగించాలి. ఆ కషాయాన్ని తాగాలి.

పాలలో కొంచెం పసుపు కలిపి.. గోరు వెచ్చగా చేసుకొని, రోజూ రెండుసార్లు తాగితే, మంచి ఫలితం ఉంటుంది.

2 చెంచాల తిప్పతీగ రసాన్ని నీటిలో కలిపి.. ప్రతి రోజూ ఉదయాన్నే తాగాలి. ఎంత తీవ్రమైన దగ్గు అయినా, త్వరగా తగ్గుతుంది.

తేనె, యష్టిమధురం, దాల్చినచెక్క.. వీటిని పొడిగా చేసి, సముపాళ్లలో నీటిలో కలిపి.. పొద్దున, సాయంత్రం చొప్పున రెండుసార్లు తాగాలి.

అర స్పూన్ నల్ల మిరియాల పొడిలో దేశీయ ఆవు నెయ్యిలో కలిపి.. బాగా కలుపుకొని, ఈ మిశ్రమాన్ని తాగాలి.

దానిమ్మ రసంలో చిటికెడు అల్లం పొడిని కలిపి తాగితే.. వెంటనే ఉపశమనం లభిస్తుంది.

అర చెంచా అల్లం పొడి, చిటికెడు దాల్చిన చెక్క పొడి, కొన్ని లవంగాలను టీలో కలిపి వేడిగా తాగితే.. వెంటనే దగ్గు తగ్గుతుంది.