Green Card vs Aadhaar Card: టీ20 వరల్డ్ కప్లో పోటీ పడుతున్న గ్రీన్ కార్డు vs ఆధార్ కార్డు.. నెట్టింట ఫన్నీ కామెంట్స్
- నేడు టీ20 వరల్డ్ కప్ లో భారత్ వర్సెస్ అమెరికా మధ్య తొలి పోరు..
- భారత్-యూఎస్ఏ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్..
- గ్రీన్ కార్డ్ vs ఆధార్ కార్డ్ అంటూ నెట్టింట కామెంట్స్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Green Card vs Aadhaar Card: ఈరోజు టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రం 7 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్ వర్సెస్ అమెరికా జట్లు పోటీ పడనున్నాయి. అయితే, యూఎస్ఏ జట్టు చూస్తుంటే ఒక కథ చెప్పాలని అనిపిస్తుంది. భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక నుంచి వెళ్లి స్థిరపడిన ఆటగాళ్లతో ఈ జట్టు ఏర్పడింది. మొత్తం స్క్వాడ్‌లో కేవలం నలుగురు మాత్రమే అమెరికాలో పుట్టిన వాళ్లు ఉన్నారు. అదీ వలస కుటుంబాల్లోనే.. మిగతా ఆటగాళ్లంతా ఫస్ట్ జనరేషన్ ఇమిగ్రెంట్స్.. పాకిస్థాన్‌లో పుట్టిన ముగ్గురు ప్లేయర్స్ కూడా ఈ జట్టులో ఉన్నారు.
Read Also: Dooms Day Clock: మరణానికి 85 సెకన్లలో భూమి.. డూమ్స్ డే క్లాక్ చెబుతున్న భయంకర నిజాలు!
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
గ్రీన్ కార్డ్ vs ఆధార్ కార్డ్!
కాగా, ఈ మ్యాచ్‌ను నెట్టింట ఫన్నీగా “గ్రీన్ కార్డ్ vs ఆధార్ కార్డ్” అని పోస్టులు పెడుతున్నారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. అలాగే, అమెరికా జట్టులో భారత సంతతికి చెందిన ఆటగాళ్లే 8 మంది ఉండటంతో మినీ ఇండియాగా పిలుస్తున్నారు. ఇక, మైదానం వెలుపల, గ్రీన్ కార్డులు అండ్ H-1B వీసాలతో కూడిన ఒక హాస్యాస్పదమైన మీమ్ తెగ వైరల్ అవుతుంది. ఈ మీమ్స్ ని అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక వినియోగదారుడు ఇలా రాసుకొచ్చాడు, “ఈ USA ప్రపంచ కప్ జట్టులో భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక వాళ్లే ఉన్నారు.. అఖండ భారత్‌కు ప్రాతినిధ్యం వహించే USA జట్టును నేను చూస్తానని ఎప్పుడూ అనుకోలేదని పేర్కొన్నాడు.
Read Also: Ragi Upma Recipe: ఉప్మా అంటే చిరాకా? తాతల ఆరోగ్య రహస్యం.. సూపర్ హెల్తీ రాగి ఉప్మా ట్రై చేయండి!
యూఎస్ఏ జట్టులో భారతీయులు:
యూఎస్ఏ జట్టు కెప్టెన్ మౌనక్ పటేల్‌తో పాటు హర్మీత్ సింగ్, శుభమ్ రంజానే, జస్దీప్ సింగ్, సంజయ్ కృష్ణమూర్తి, మిలింద్ కుమార్, సైటేజ ముక్కమల్లా, సౌరభ్ నేత్రావల్కర్ ఉన్న ఎనిమిది మంది ఆటగాళ్లకు భారత మూలాలు ఉన్నాయి. అయితే, హర్మీత్, శుభమ్, నేత్రావల్కర్ ఈ ముగ్గురు ముంబై మైదానాల్లోనే క్రికెట్ ప్రాక్టీస్ చేశారు. ఒకప్పుడు సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబేతో కలిసి అదే మైదానాల్లో ఆడిన వాళ్లే.. ఇక, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. హర్మీత్, శుభమ్, నేత్రావల్కర్ ఇప్పుడు డాలర్ల దేశానికి వెళ్లారు.. కానీ నేను దీన్ని సానుకూలంగానే చూస్తాను.. క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోందనే దానికి ఇది నిదర్శనం.. వాళ్లతో నేను ఇంతకు ముందు చాలా మ్యాచ్‌లు ఆడాను.. కానీ ఇప్పుడు మేం మా ఆట మీదే ఫోకస్ చేస్తున్నాం.. ముంబైలో ఆడటం మాకు అదనపు బలం అని తెలిపాడు.
Read Also: Jogi Ramesh: జోగి రమేష్‌కు మరో షాక్.. నాన్-బెయిలబుల్ కేసు నమోదు..
చరిత్రకు సృష్టించేందుకు భారత్ ప్రయత్నం:
టీ20 ఫార్మాట్‌లో సర్ప్రైజ్ లు సాధారణం.. కానీ ఈసారి భారత్ మాత్రం పూర్తి ఆధిపత్యంతో టోర్నమెంట్లోకి అడుగు పెడుతోంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా టీ20 వరల్డ్ కప్‌ను డిఫెండ్ చేయడమే కాదు, మూడోసారి ట్రోఫీ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, ఇప్పటి వరకు ఏ జట్టూ టీ20 వరల్డ్ కప్‌ను డిఫెండ్ చేయలేదు.. అంతేకాదు, హోం గ్రౌండ్‌లో వరల్డ్ కప్ గెలిచిన జట్టు కూడా ఇప్పటి వరకు గతంలో లేదు.. ఈ రెండు రికార్డులను చెరిపేయాలనే నమ్మకంతో భారత్ బరిలోకి దిగుతోంది.
భారత్ ఫామ్:
* 2024లో టైటిల్ గెలిచిన తర్వాత భారత్ జట్టు ఇప్పటి వరకు వెనుదిరిగలేదు.. 41 టీ20 మ్యాచ్‌ల్లో 33 విజయాలు సాధించింది. గత రెండేళ్లలో 80 శాతం విన్ రేటింగ్ తో దూసుకుపోతుంది. 12 సార్లు 200+ స్కోర్లు సాధించింది. 297/6, 283/1, 271/5 – భారత్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లు చేసింది. అలాగే, హై రిస్క్ బ్యాటింగ్ చేసినా.. ఫలితాలు భారత్‌కు అనుకూలంగా వచ్చాయి.
అమెరికా ఆశలు:
అమెరికా జట్టు గత వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌ను సూపర్ ఓవర్‌లో ఓడించి అందరి దృష్టిని ఆకర్షించింది. అనంతరం పరిపాలనా సమస్యలు ఎదురైనా.. మైదానంలో మాత్రం నిలకడగా ఆడుతోంది. కాగా, 2025 ICC AGMలో Associate Team of the Year అవార్డు గెలుచుకోవడంతో యూఎస్ఏ ఎదుగుదలకు నిదర్శనం.. మేజర్ లీగ్ క్రికెట్ ద్వారా మరింత అనుభవం సంపాదించిన ఈ జట్టు.. 2026 వరల్డ్ కప్‌లో కూడా గట్టి పోటీ ఇవ్వాలనే లక్ష్యంతో ఉంది. అయితే, భారత్, అమెరికా ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే టీ20 వరల్డ్ కప్ లో తలపడ్డాయి. 2024లో న్యూయార్క్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది.
పిచ్ పరిస్థితులు:
ముంబైలో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగా ఉన్నాయి. అయితే, రాత్రి వేళ డ్యూ వచ్చే అవకాశం ఉంది. దీంతో వాంఖడే పిచ్ మరింత బ్యాటింగ్ ఫ్రెండ్లీగా మారే ఛాన్స్ ఉంది.
భారత్ జట్టు అంచనా:
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
అమెరికా జట్టు అంచనా:
సైటేజ ముక్కమల్లా, ఆండ్రీస్ గౌస్ (వికెట్ కీపర్), షయాన్ జహాంగీర్, మౌనక్ పటేల్ (కెప్టెన్), మిలింద్ కుమార్, హర్మీత్ సింగ్, శుభమ్ రంజానే, మహ్మద్ మొహ్సిన్, షాడ్లీ వాన్ షాల్క్విక్, సౌరభ్ నేత్రావల్కర్, అలీ ఖాన్.
తాజావార్తలు
-
Prabhas : ‘స్పిరిట్’కు బ్రేక్ ఇచ్చి ‘ఫౌజీ’ సెట్స్ లోకి ప్రభాస్
-
HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
Nithiin: ఫ్లాప్‌ల తర్వాత ఫుల్ ఫోకస్.. వరుసగా మూడు సినిమాలతో భారీ కమ్‌బ్యాక్‌కు సిద్ధమైన నితిన్!
-
OLED డిస్‌ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!