Sugar-Free Ice Cream Recipe: చక్కెర లేకుండా హెల్తీ ఐస్‌క్రీమ్ చేసేయండి ఇలా.. పిల్లల నుంచి పెద్దల వరకు పోటీపడి తినేస్తారంతే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sugar-Free Ice Cream Recipe: పిల్లలకు, అలాగే కొంతమంది పెద్దలకు ఐస్‌క్రీమ్ అంటే చాలా ఇష్టం. అయితే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది తల్లిదండ్రులు వాటిని పిల్లలు ఇవ్వడానికి సంకోచిస్తారు. కానీ ఇప్పుడు చక్కెర, క్రీమ్, కండెన్స్‌డ్ మిల్క్, మిల్క్ పౌడర్ లేదా ఫ్లోర్ లేకుండానే ఇంట్లో హెల్తీ ఐస్‌క్రీమ్ తయారు చేయడం సాధ్యమే. ఈ ఐస్ క్రీమ్ ను డయాబెటిస్ ఉన్నవారు కూడా పరిమితంగా ఎలాంటి మొహమాటం లేకుండా తినవచ్చు. మరి దీనిని ఎలా చేయాలో చూసేద్దామా..
Creamy & Tasty: పుట్టగొడుగులతో అదిరిపోయే పాస్తా రెసిపీ.. పిల్లలు అడిగి మరీ తింటారు.!
Also Read
- Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
- Rahul Gandhi: ‘జ్ఞానేశ్ కుమార్ దేశద్రోహి’.. CECపై రాహుల్ సంచలన ఆరోపణలు
- Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
- Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
అవసరమైన పదార్థాలు:
* జీడిపప్పు – 100 గ్రాములు
* బాదం – 200 గ్రాములు
* రోల్డ్ ఓట్స్ – ¼ కప్పు
* ఖర్జూరాలు – 10 నుంచి 15
* పాలు – 1½ కప్పులు (వేర్వేరు దశల్లో)
* కోకో పౌడర్ – 2 టేబుల్ స్పూన్లు
* వెనీలా ఎసెన్స్ – ½ టీ స్పూన్
* డార్క్ చాక్లెట్ – ¼ కప్పు (ఐచ్చికం)
* తేనె– అవసరమైతే
* టాపింగ్ కోసం ఆల్మండ్స్ లేదా చాకో చిప్స్ లేదా జీడిపప్పు ముక్కలు
తయారీ విధానం:
మొదట ఒక బౌల్‌లో జీడిపప్పు, బాదం వేసి నీళ్లలో నానబెట్టాలి. బాదం తొక్క సులభంగా తీసేందుకు గోరువెచ్చని నీళ్లు ఉపయోగిస్తే మంచిది. ఆ తర్వాత పాన్‌లో రోల్డ్ ఓట్స్‌ను తక్కువ మంటపై 3 నిమిషాలు సన్నని మంటపై వేయించాలి. వీటిలో గింజలు తీసిన ఖర్జూరాలు, ఒక కప్పు గోరువెచ్చని పాలు వేసి ఒకటి నుంచి రెండు గంటలు నానబెట్టాలి.
బడ్జెట్ సెగ్మెంట్‌లో సంచలనం.. 10000mAh బ్యాటరీతో వస్తున్న Honor X80.!
ఇప్పుడు మిక్సీ జార్ లో తొక్క తీసి శుభ్రంగా కడిగిన బాదం, నానిన ఓట్స్, ఖర్జూరాలు, జీడిపప్పు, కోకో పౌడర్, వెనీలా ఎసెన్స్, అర కప్పు పాలు వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పాన్ లో వేసి.. అవసరమైతే డార్క్ చాక్లెట్ జోడించి సన్నని మంటలో 5 నిమిషాలు క్రీమీగా అయ్యే వరకు కలుపుతూ కుక్ చేయాలి. ఆ తర్వాత పూర్తిగా దానిని చల్లారనివ్వాలి.
చల్లారిన తర్వాత మళ్లీ మిక్సీలో వేసి ఫైన్‌గా బ్లెండ్ చేయాలి. స్వీట్ నెస్ తక్కువగా అనిపిస్తే కొద్దిగా హనీ జోడించవచ్చు. ఈ మిశ్రమాన్ని ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసి, పైభాగాన్ని బటర్ పేపర్ తో కవర్ చేసి ఫ్రీజర్ లో కనీసం 8 గంటలు లేదా ఓవర్‌నైట్ ఫ్రీజ్ చేయాలి. అంతే చెక్కర్లేని స్మూత్ ఐస్ క్రీం రెడీ. ఫ్రీజర్ నుంచి తీసిన తర్వాత రోస్టెడ్ ఆల్మండ్స్, చాకో చిప్స్ లేదా గ్రేటెడ్ డార్క్ చాక్లెట్‌తో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. దానితో అది మరింత టేస్టీగా ఉంటుంది. ఇలా తయారైన ఐస్‌క్రీమ్ క్రీమీగా, నేచురల్ స్వీట్‌నెస్‌తో చాలా టేస్టీగా ఉంటుంది.
తాజావార్తలు
-
Comrade Kalyan : ‘కామ్రేడ్ కళ్యాణ్’ వాయిదా ?
-
Mahadev Betting App Case: మహదేవ్ కేసులో బిగ్ అరెస్ట్.. ఎయిర్‌పోర్టులోనే పట్టివేత.!
-
Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
-
Rahul Gandhi: ‘జ్ఞానేశ్ కుమార్ దేశద్రోహి’.. CECపై రాహుల్ సంచలన ఆరోపణలు
-
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!