AP Crime: ఆమెకు 37.. మైనర్‌తో ఎఫైర్.. భర్త, అత్తను లేపేసేందుకు స్కెచ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: ఓ మైనర్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వివాహిత.. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారనే విషయాన్ని మరిచిపోయింది.. కుటుంబ పెద్దను.. అడ్డుగా ఉన్న అత్తను వేసేయాలని ప్లాన్ చేసింది.. దానికి అనుగుణంగా.. తన మైనర్ ప్రియుడిని రెచ్చగొట్టింది.. చిత్తూరులో సంచలనంగా మారిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గిరింపేట ప్రాంతానికి చెందిన 37 ఏళ్ల వివాహిత.. 17 ఏళ్ల మైనర్ బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది.. ఈ ఘటన సంచలనంగా మారింది.. పోలీసుల ప్రకారం, సదరు వివాహిత.. తన భర్త, అత్తను చంపాలని మైనర్‌ను ఉసిగొల్పిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ప్రయత్నంలో ఆమె మైనర్‌ని ప్రేరేపించి, వృద్ధురాపై దాడి చేయించిందని పోలీసులు చెప్పారు.
Read Also: Easy & Healthy Paneer Tikka Chapati: పిల్లలకి చపాతీ రోల్ ఇలా చేసి పెట్టారంటే రోజూ ఇదే కావాలంటారు..
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
వివాహితకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరూ 15 ఏళ్ల వరకు ఉన్నారు.. అయితే, ఆ మహిళకు 17 ఏళ్ల బాలుడిపై మనస్సు పడింది.. అంతేకాదు.. అతడితో అక్రమ సంబంధం పెట్టుకుంది.. తరచూ ఇద్దరూ ఏకాంతంగా కలిసేవారు.. అయితే, పిల్లలు, భర్త లేని సమయంలో.. కలిసే అవకాశం ఉన్నా.. తన అత్త అడ్డుగా మారిపోయింది.. దీంతో, భర్తను, అత్తను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది.. దాని కోసం ఆ బాలుడిని ఉసిగొల్పింది.. కేసు వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రాత్రి మైనర్.. వృద్ధురాపై దాడికి ప్రయత్నించాడు.. కళ్లలో కారం చల్లి.. కత్తితో గొంతు కోసేందుకు ప్రయత్నం చేశాడు.. బాధితురాలు కేకలు వేయడంతో వెంటనే స్థానికులు అక్కడి చేరుకున్నారు.. వృద్ధురాలిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..
ఘటనా స్థలంలోనే మైనర్ బాలుడు పట్టుబడగా.. ఈ ఘటనలో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న వివాహిత మాత్రం ఇంటి నుంచి పరారైంది.. బాలుడిని అరెస్ట్ చేసి జువెనైల్ హోమ్‌కు తరలించారు పోలీసులు.. చిత్తూరు పోలీస్ స్టేషన్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.. మైనర్‌కు పూర్తి రక్షణ, సైకాలాజికల్ సపోర్ట్ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు పేర్కొన్నారు. పరారీలో ఉన్న కవితను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది..
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!