Euphoria Movie Review: ‘యుఫోరియా’ రివ్యూ.. గుణశేఖర్ సక్సెస్ అందుకున్నారా?
- 'యుఫోరియా' తెలుగు మూవీ రివ్యూ
- గుణశేఖర్ సక్సెస్ అందుకున్నారా?
- ప్రతిఒక్కరిని ఆలోచింపజేసేలా యుఫోరియా కథ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: Sara Arjun, Bhumika Chawla, Gautham Vasudev Menon, Vignesh Gavireddy
- DIRECTOR: Gunasekhar
- MUSIC: Kala Bhairava
- PRODUCER: Ragini Gunasekaran, Neelima, Yukta Mukhi
Euphoria Telugu Movie Review: తెలుగు సినిమా రంగంలో ప్రతిభావంతమైన దర్శకులలో ‘గుణశేఖర్’కు ప్రత్యేక గుర్తింపు ఉంది. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ.. ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ‘ఒక్కడు’, ‘రుద్రమదేవి’, ‘రామాయణం’ వంటి సినిమాల ద్వారా చారిత్రాత్మక, సామాజిక, యాక్షన్ జానర్లలో తనదైన శైలిని నిలబెట్టుకున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఖాతాలో విజయాలు లేవు. ఆ మధ్య ‘శాకుంతలం’ సినిమా పరాజయం తర్వాత.. పూర్తిగా కొత్త ఆలోచనతో ‘యుఫోరియా’ అనేచిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి గుణశేఖర్ సక్సెస్ అందుకున్నారా? అనేది రివ్యూలో చుద్దాం.
కథ:
చైత్ర (సారా అర్జున్) ఒక సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి. చదువులో ఎప్పుడూ టాపర్‌గా నిలిచే చైత్రకు ఐఏఎస్ అవ్వాలన్నదే లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు క్రమశిక్షణతో పరీక్షలకు సిద్ధమవుతుంటుంది. అయితే ఒక రోజు తన స్నేహితురాలు పబ్‌లో జరిగే పార్టీకి ఆహ్వానించడంతో.. తల్లిదండ్రుల అనుమతితో అక్కడికి వెళ్తుంది. ఆ పార్టీలో వికాశ్ (విఘ్నేశ్ గవిరెడ్డి)తో ఆమెకు పరిచయం ఏర్పడుతుంది. చైత్ర అందచందాలపై వికాశ్ కన్నేస్తాడు. పార్టీ అనంతరం చైత్రకు మాయమాటలు చెప్పి కారులో తీసుకెళ్తాడు. ఆపై స్నేహితులతో కలిసి అత్యాచారం చేస్తాడు. చైత్ర తన తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసును ఛేదించేందుకు సిటీ కమిషనర్ జయదేవ్ (గౌతమ్ మేనన్) రంగంలోకి దిగుతాడు. బడా నేతల పిల్లలు నిందితులుగా ఉండటంతో.. దర్యాప్తు క్లిష్టంగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో కమిషనర్ ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి?, కేసులో వింధ్య వేములపల్లి (భూమిక)కి ఉన్న సంబంధం ఏంటి?, తప్పు చేసిన వారికి శిక్ష పడిందా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ:
2022లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ పబ్ అత్యాచార ఘటన, మరికొన్ని సంఘటనల్ని స్ఫూర్తిగా తీసుకుని.. డైరెక్టర్ గుణశేఖర్ యుఫోరియా కథను సిద్ధం చేసుకున్నారని ఇట్టే అర్థమవుతోంది. ప్రస్తుత యువత మాదకద్రవ్యాలకు బానిసలై.. ఎలాంటి నేరాలకు పాల్పడుతున్నారో దర్శకుడు చూపించారు. డ్రగ్స్‌కు బానిసైన తల్లిదండ్రుల జీవితాలు కూడా ఎంత నరకంగా ఉంటాయో కూడా చూపించారు. దర్శకుడు ముందుగా వికాశ్ అండ్ గ్యాంగ్‌ను పరిచయం చేసి.. వెంటనే భూమిక పాత్రతో కథపై ఆసక్తి కలిగించేలా చేశారు. చైత్ర అత్యాచార ఘటన కేసు ఇన్వెస్టిగేషన్ మొదలయ్యాక.. సినిమా కాస్త ఊపందుకుంటుంది. కేసు కోసం కమిషనర్ వ్యవహరించే తీరు ఆసక్తిరేకెత్తిస్తుంది. మైనర్లపై అత్యాచారం కేసుల్లో పోక్సో చట్టం ఎంత శక్తివంతంగా ఉంటుందో చెప్పడంలో గుణశేఖర్ సక్సెస్ అయ్యారు. అయితే సెకండాఫ్‌లో కథ గాడి తప్పింది. తల్లి, కొడుకు మధ్య చూపించిన బంధం బాగున్నా.. అది ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. అయితే చివరలో సినిమా ప్రతిఒక్కరిని ఆలోచింపజేసేలా ఉంటుంది.
ఎవరెలా చేశారంటే:
చైత్ర పాత్రలో సారా అర్జున్ ఆకట్టుకున్నారు. ఆమె నటన, హావభావాలు అందరి మనసుల్ని కదిలిస్తాయి. తెరపై ఆమె చాలా అందంగా కనిపించారు. వింధ్య వేములపల్లి పాత్రలో భూమిక జీవించిందనే చెప్పాలి. ఎంతో అనుభవం ఉన్న భూమిక సినిమాకు చాలా ప్లస్ అయ్యారు. గౌతమ్ మేనన్ నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి పాత్రల్లో ఇప్పటికే ఆయన నిరూపించుకున్నారు. డ్రగ్స్ బానిసైన కుర్రాడిగా వికాశ్ పాత్రలో విఘ్నేశ్ పర్వాలేదనిపించాడు. జైలు ఎపిసోడ్స్‌లో అతడి నటన బాగుంది. రోహిత్, రవి ప్రకాశ్, నాజర్ తదితరులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. భావోద్వేగాలు సినిమాలో కొరబడ్డాయి. కాల భైరవ సంగీతం కథకు తగ్గట్లుగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. డైరెక్టర్ గుణశేఖర్ తీసుకున్న పాయింట్ మంచిదే అయినా.. ఇంకాస్త ఆసక్తికరంగా ఆవిష్కరించి ఉంటే బాగుండేది.
ఫైనల్లీ: యూత్‌ను ఆలోచింపచేసే సినిమా యుఫోరియా.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!