Donne Biryani Recipe: బెంగళూరు మిలిటరీ హోటల్ టేస్ట్.. రెస్టారెంట్ స్టైల్‌లో దొన్నె బిర్యానీ ట్రై చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donne Biryani Recipe: హైదరాబాద్ బిర్యానీకి ఫేమస్ అని పెద్దగా చెప్పనవసరం లేదు. ఏ దావత్ అయినా బిర్యానీ పక్కా ఉండాల్సిందే. అయితే.. ఈ సారి ఎప్పుడూ చేసే బిర్యానీ కాకుండా ఈసారి రెస్టారెంట్ స్టైల్ టేస్టీ టేస్టీ దొన్నె బిర్యానీ ట్రై చేద్దాం.. దొన్నె బిర్యానీ అనగానే బెంగళూరు వీధుల్లో ఉన్న మిలిటరీ హోటళ్లూ, నాటి స్టైల్ తినుబండారాలూ గుర్తొస్తాయి. పెద్ద పెద్ద హోటళ్లలో కాదు.. చిన్న షాపుల్లో, అరటికాయ ఆకుల్లాంటి అరేకా ఆకులతో చేసిన దొన్నెలో వడ్డించే బిర్యానీ ఇదే. ఆ వాసన, ఆ రంగు, ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి తింటే మర్చిపోలేం. ఆకుకూరలూ, మసాలాలూ కలిసిన పచ్చటి పసుపు రంగు దీనికి ప్రత్యేక రుచిని అందిస్తుంది. ఈ బిర్యానీలో బాస్మతి కాదు.. సీరగ సాంబా బియ్యమే వాడతారు. చిన్న గింజలు, ఘుమఘుమల వాసన ఈ బిర్యానీ మ్యాజిక్. ఇప్పుడు ఈ డోన్నే బిర్యానీని ఇంట్లో ఎలా చేయాలో చూద్దాం.
Also Read
- Ellipaya Karam: నానమ్మల నాటి నాటు రుచి.. జ్వరం, జలుబును తరిమికొట్టే ఎల్లిపాయ కారం సింపుల్ ఇలా చేసేయండి!
- Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా 'వెజ్ సూప్' ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
- Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
- Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
ముందుగా సీరగ సాంబా బియ్యాన్ని (బియ్యం తమిళనాడుకు చెందిన చిన్న, సుగంధభరితమైన (aromatic) సాంప్రదాయ బియ్యం రకం) తీసుకోవాలి. ఈ బియ్యం కొన్ని పట్టణాలలో సులభంగా దొరుకుతుంది. హైదరాబాద్ నగర వాసులకు మార్కెట్లో సులభంగా లభిస్తాయి. ఈ బియ్యాన్ని తీసుకుని బాగా కడిగి అరగంట పాటు నానబెట్టాలి. ఈ నానబెట్టడం వల్ల బియ్యం చక్కగా ఉడుకుతాయి. చికెన్ తీసుకోవాలి. ఎముకలు తీయొద్దు. చికెన్‌లో పెరుగు, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. ఇది వండేటప్పటికి లోపలివరకు రుచి చేరుతుంది. ఇప్పుడు ఈ బిర్యానీకి ప్రాణం అయిన పచ్చ మసాలా తయారు చేసుకోవాలి. అందుకు ముందుగా పుదీనా ఆకులు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, దేశీ వెల్లుల్లి, కొద్దిగా కసూరి మెంతి తీసుకుని ఇవన్నీ మిక్సీలో వేసి, అవసరమైనంత నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పేస్టే బిర్యానీకి ఆ పచ్చటి రంగు, ప్రత్యేక వాసన ఇస్తుంది.
READ MORE: Vivo X200T Review: మూడు 50MP కెమెరాస్, 6200mAh బ్యాటరీ.. ‘వివో ఎక్స్200టీ’ రివ్యూ!
ఇప్పుడు వంట మొదలు పెట్టాలి. ఒక పెద్ద పాన్ తీసుకుని కాస్త నెయ్యి, నూనె వేసి వేడి చేయాలి. కొబ్బరి నూనె వాడితే ఇంకా నాటి వాసన వస్తుంది. అందులో బిర్యానీకి వాడే మొత్తం మసాలాలైన యలకలు, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ అనీస్, మరాఠీ మొగ్గు, సోంపు వేసి కొద్దిగా వేగించాలి. వెంటనే ఉల్లిపాయ ముక్కలు వేసి మృదువుగా అయ్యే వరకు వేయించాలి. ఉల్లిపాయలు కాలిపోకుండా చూసుకోవాలి. ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత పచ్చ మసాలా పేస్ట్ వేసి కొన్ని నిమిషాలు బాగా వండాలి. వాసన పోయాక బిర్యానీ మసాలా, మీట్ మసాలా, మిరియాల పొడి, ధనియాల పొడి వేసి ఒక్క నిమిషం కలపాలి. అప్పుడే మసాలా మంచి వాసన ఇస్తుంది. ఇప్పుడు ముందే మెరినేట్ చేసిన చికెన్ వేసి బాగా కలపాలి. మంట తగ్గించి మూత పెట్టాలి. నీళ్లు మాత్రం అసలు పోయకూడదు. చికెన్ రసంలోనే నెమ్మదిగా ఉడకాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ, సుమారు 10–12 నిమిషాలు తక్కువ మంటపై వండాలి. చికెన్ బాగా ఉడికిన తర్వాత వేడి నీళ్లు పోయాలి. బియ్యం–నీటి నిష్పత్తి చాలా ముఖ్యం. రెండు కప్పుల బియ్యానికి నాలుగు కప్పుల నీళ్లు పోయాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని వడకట్టి పాన్‌లో వేయాలి. కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసి మెల్లగా కలపాలి. నీరు మరిగేవరకు వేచి ఉండాలి. నీరు మరిగిన వెంటనే మూత పెట్టి, ముందే వేడి చేసిన ఓవెన్‌లో పెట్టాలి. 200 డిగ్రీల వద్ద ఇరవై నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఓవెన్ లేకపోతే చాలా తక్కువ మంటపై దమ్ పెట్టినా చేస్తుంది. ఉడికిన తర్వాత వెంటనే మూత తీయకూడదు. కనీసం పదిహేను నిమిషాలు అలాగే ఉంచాలి. అప్పుడు బియ్యం విరిగిపోకుండా రుచి అంతా కలిసిపోతుంది. మూత తీసి మెల్లగా కలిపితే.. పచ్చటి రంగులో, ఘుమఘుమల వాసనతో డోన్నే బిర్యానీ రెడీ.
తాజావార్తలు
-
Sahil Wakode Death: ‘‘నేను తప్పు చేశా’’.. ఆతహత్యకు ముందు స్నేహితురాలికి సాహిల్ చివరి కాల్..
-
UP: 2047 వరకు అఖిలేష్ కుటుంబంలో ఎవరూ ముఖ్యమంత్రి అవ్వరు.. యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
-
The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
-
Vivo S2 FE: 10,000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, IP68 + IP69 రేటింగ్.. వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్..
-
Chandigarh University: ఫ్రెషర్స్ వేడుకలో అసభ్యకర డ్యాన్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!